Ayyanna Patrudu : వైసీపీ నాయకులపై గత కొద్ది రోజులుగా టీడీపీ నాయకులు వరుస విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జగన్‌తో పాటు రోజాని పలువురు మంత్రులని టీడీపీ నాయకలు విమర్శలు చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ఇటీవల మహానాడులో మాట్లాడుతూ.. ‘‘మంత్రి రోజా.. రాజకీయం అంటే జబర్దస్త్ స్టేజ్ షో కాదు. మా తెలుగుదేశం నేతలకు రోజమ్మ ఏదో చీరలు పంపుతుందట. జబర్దస్త్ రింగుల రాణి రోజా తన భర్తకు చీర కట్టించి ఇంట్లో కూర్చొపెట్టింది అని ఆమెకి చురకలు అంటించాడు. .రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలిసిన వ్యక్తి బాబు.రాబోయే పదేళ్ల ప్రగతి ఆలోచించే వ్యక్తి బాబు అని ఆయన స్పస్టం చేశాడు.
బడుగులకు ప్రాధాన్యం ఇచ్చిన ఘనత టీడీపీదే.బాలయోగి, ఎర్రన్నాయుడు వంటి వారికి ఉన్నత పదవులు ఇచ్చిన ఘనత టీడీపీదే అని, తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయం’’ అని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. దేశంలోని ఎన్నో సంక్షేమ పథకాలకి ఎన్టీఆర్ మార్గదర్శకం అని ఆయన కొనియాడారు. నాలుగేళ్లుగా ప్రతిపక్షాలను సీఎం జగన్ ఇబ్బంది పెడుతున్నారని అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. జగన్ పాలనలో ఎక్కడ చూసినా దోపిడీ తప్ప మరేమి కనిపించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛను రూ.3 వేలు ఇస్తానని చెప్పి మోసం చేసిన జగన్… 25 లక్షల ఇళ్లు ఇస్తానని చెప్పి ఒక్క ఇల్లు కూడా కట్టలేదని ఆరోపించారు.
సీఎం జగన్ తో పాటు రాష్ట్రంలో ఏ మంత్రికీ విషయ పరిజ్ఞానం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్, పిల్లల భవిష్యత్తు కోసం వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీడీపీ రావాలన్నారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున గంజాయి సాగవుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారా? ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు? అని అడిగారు. అన్నపూర్ణ లాంటి రాష్ట్రానికి గంజాయి అందించడం దురదృష్టకరమని చురకలంటించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…