Darshith : మహానాడులో చంద్రబాబు ముందు అదరిపోయే స్పీచ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు దర్శిత్ అనే కుర్రాడు. సుత్తి లేకుండా.. చాలా నేర్పుగా… నేరుగా మాట్లాడి అందరి ప్రశంసలు అందుకున్నాడు పోట్లూరి దర్షిత్. అతిరథ మహారధులు పాల్గొన్న రాజమహేంద్రవరం మహానాడులో నూనుగూ మీసాలతో వచ్చిన దర్షిత్ జస్ట్ 4 నిమిషాల 44 సెకన్లల్లో విషయం మొత్తం క్లియర్ గా చెప్పేశాడు. అతగాడి వాగ్దాటికి.. వేదికపై ఉన్న సీనియర్లే కాదు, మహానాడుకు విచ్చేసిన వారు సైతం ముగ్దులయ్యారు. ఇప్పుడు అతను ఎవరిని ప్రతి ఒక్కరు ఆరాలు తీస్తున్నారు. అతని స్వస్థలం విజయవాడ. బాల్యం నుంచి విద్యాభ్యాసమంతా విజయవాడలోనే జరిగింది.
ప్రస్తుతం స్థానిక ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతోన్నారు. 2015లో దర్షిత్ వయస్సు 11 ఏళ్లు.. అప్పటికే రాష్ట్ర విభజన జరిగిపోయి.. 2014 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నవ్యాంధ్ర నూతన రాజధానిగా అమరావతిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆ క్రమంలో చంద్రబాబు నవనిర్మాణ దీక్ష చేపట్టిన సమయంలో తాను దాచుకొన్న 2 వేల రూపాయిల నగదును సీఎం చంద్రబాబుకు స్వయంగా అందజేశారు. అలా పోట్లూరి దర్షిత్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎన్వీ రమణకు దర్షిత్ స్వయంగా రెండు పేజీల లేఖ రాశారు.
ఆ లేఖలో సారాంశం, అతను రాసిన తీరు అప్పటి చీఫ్ జస్టిస్ ఎన్వీరమణను ఆకట్టుకుంది. దర్షిత్ లేఖకు జవాబు ఇవ్వడమే కాకుండా దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా బాద్యతలు చేపట్టిన తర్వాత జస్టిస్ ఎన్. వి. రమణను దర్షిత్ కలిశారు. అలాగే భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడును సైతం దర్షిత్ కలిశారు. దర్షిత్ వాగ్దాటి, ఆలోచన తీరు, రాష్ట్ర పరిస్థితులపై అతి చిన్న వయస్సులోనే అంతగా అవగాహన ఉండడం పట్ల వెంకయ్యనాయుడు శుభాశీస్సులు అందుకున్నారు. జగన్ నాలుగేళ్ల పాలనపై చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను సోషల్ మీడియా వేదిగాక ప్రజల్లోకి తీసుకు వెళ్లి.. వారిని చైతన్యవంతులుగా మార్చేందుకు ఎంతగానో శ్రమిస్తున్నాడు దర్షిత్. 2021లో టీడీపీ విద్యార్థి విభాగం అధికార ప్రతినిధిగా దర్షిత్‌ని నియమించబడ్డారు. అతనికి సంబంధించిన ఏ వీడియో అయిన కొద్ది నిమిషాలలోనే నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంటుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…