Avatar 2 : హాలీవుడ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్-ది వే ఆఫ్ వాటర్ . గత సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద ఎంత ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇన్ని నెలలు థియేటర్ ఆడియన్స్ అలరించిన ఈ సినిమా ఇప్పడు ఓటీటీ ప్రేక్షకులను పండోరా గ్రహానికి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భారీ రేటుకు సొంతం చేసుకోవడం జరిగింది.కానీ ఒక్క హాట్‌స్టార్‌లోనే కాకుండా పలు ఓటీటీల్లో సందడి చేసేందుకు రేడీ అయ్యింది.
అవతార్ 2 సినిమా ప్రస్తుతం యాపిల్ టీవీ , ప్రైమ్ వీడియో, వుడు, గూగుల్ ప్లే, ఫైనిటి, ఎఎమ్ సీ అండ్ మైక్రోసాఫ్ట్ ఫ్లాట్ ఫామ్స్‌లో పే ఫర్ వ్యూ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతోంది. చూాడాలంటే రెంటల్ ధర: $19.9 డాలర్స్ లేక 1639 రూపాయలు చెల్లించాలి . యాపిల్ టీవీ ప్లస్ లేదా ఐ ట్యూన్‌లో అవతార్ 2ని ఒకసారి చూడటానికి వినియోగదారులు రూ.590 చెల్లించాలి. యూట్యూబ్ లో హెచ్ డీ వర్షెన్ కోసంరూ. 850 , ఎస్ డీ వెర్షన్‌కు 690 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.అయితే ఈ సినిమాను ఏప్రిల్ 28నుంచి ఫ్రీగా చూడొచ్చని అంటున్నారు.. డిస్నీ హాట్ స్టార్ తన సబ్క్రైబర్స్ కోసం ఏప్రిల్ 28నుంచి అవతార్ 2 స్ట్రీమింగ్ చేయనుందని తెలుస్తోంది. ఈ సినిమా హాట్ స్టార్ తెలుగుతో పాటు ఇంగ్లీష్, తమిళ్, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయంలో త్వరలో ఓ ప్రకటన విడుదలకానుంది.
వరల్డ్ వైడ్’గా 2 బిలియన్ డాలర్స్‌ను రాబట్టిన ఈచిత్రం.. క్లోజింగ్ కలెక్షన్స్‌ను చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. నైజాంలో 31.46 కోట్లు, సీడెడ్ 7.01 కోట్లు, ఉత్తరాంధ్ర 8.13 కోట్లు, ఈస్ట్+ వెస్ట్ 3.68 కోట్లు, కృష్ణా +గుంటూరు 7.11 కోట్లు, నెల్లూరు 3.35 కోట్లు, మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 60.74 కోట్ల షేర్ వసూలు అయ్యిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇండియాలో దాదాపుగా అన్ని ప్రధాన భాషల్లో కూడా విడుదలైంది. తెలుగు వర్షన్‌కు ప్రముఖ తెలుగు యువ దర్శకుడు, నటుడు అవసరాల శ్రీనివాస్ డైలాగ్స్ రాశారు. దీంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. అవతార్ 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను రాబట్టింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…