సినిమా సెలబ్రిటీలు అయినప్పటికీ వారికి కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. వారు కూడా కొన్ని జాతకాలని నమ్ముతూ పూజలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామితో రీసెంట్‌గా ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ రాజ శ్యామల హోమం చేయించుకుంది. నిధి అగర్వాల్ కి అందం, అభినయం రెండు ఉన్నాయి. కానీ ఏవీ కలిసి రావట్లేదు. పవన్ కళ్యాణ్, ప్రభాస్ కొత్త సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. అంత హై ప్రొఫైల్ సినిమాలు తన ఖాతాలో ఉన్నా రావాల్సిన గుర్తింపు రావట్లేదు. ఆ పెద్ద సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయో తెలియదు.
అందుకే విఘ్నాలు తొలగి జెట్ స్పీడ్ గా తన కెరీర్ దూసుకుపోవాలని కోరుకుంటూ ఆమె రాజ శ్యామల పూజ నిర్వహించింది. సెలెబ్రిటీలకు పూజలు చెయ్యడంలో పేరొందిన వేణు స్వామి నిధి పేరుతో పూజలు చేయగా, అందుకు సంబంధించిన ఫొటోలునెట్టింట వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్స్ ఎందుకు రాజ శ్యామల హోమం చేస్తున్నారన్న విషయం చర్చకు వచ్చింది. కొన్ని నెలల ముందు, సమంతా హైదరాబాద్‌లోని తన నివాసంలో 12 మంది పూజారులతో రాజ శ్యామల హోమం నిర్వహించింది. ఆమె కొన్ని దేవాలయాలు మరియు ఇతర ప్రదేశాలలో ఇతర హోమాలు కూడా చేసింది.
ఆ తర్వాత రష్మిక రాజ శ్యామల హోమం చేయడానికి హైదరాబాద్ నుండి కర్నాటకకు వెళ్లినట్టు ప్రచారం జరిగింది.ఇదే హోమం కోసం కృతి సనన్, పూజా హెగ్డే వంటి మరికొందరు స్టార్ హీరోయిన్లు వరుసలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే వారు ఇలా చేయడానికి కారణం వారి వృత్తిలో విజయవంతమైన ఫలితాలను చూస్తారని, శత్రువుల నుండి రక్షించబడుతుందని నమ్ముతారు. ఇటీవల పూజా పెద్దమ్మ ఆలయంలో ఈ పూజా హోమం నిర్వహించినట్టు కూడా వార్తలు వచ్చాయి.. చూడాలి మరి రానున్న రోజులలో ఇంకెంతమంది ఈ పూజలు చేస్తారో.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…