Aadipurush : ప్రభాస్, కృతి సనన్ ప్రధాన పాత్రలలో ఓం రౌత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఆదిపురుష్. రామాయణ గాధతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు అభిమానుల్లో ఉండేవి. ఇటీవల టీజర్ విడుదలయ్యాక అంచనాలన్నీ తలక్రిందులు అయ్యాయి. గ్రాఫిక్స్ మాయలో పడి రామాయణాన్ని, ఆ పాత్రలని కించపరిచారు అంటూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అసలు ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావలసిన ఈ చిత్రం నెగిటివ్ ఇంపాక్ట్ కారణంగా జూన్ కి వాయిదా వేసారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అప్పుడు కూడా వస్తుందో రాదో క్లారిటీ లేదు.
శ్రీరామనవమి సందర్భంగా గురువారం చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేశారు. టీజర్ కి ఎలాంటి విమర్శలు ఎదురయ్యాయో పోస్టర్ ని కూడా నెటిజన్లు అదే విధంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ కొత్త పోస్టర్‌లో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ఉన్నారు. ప్రభాస్, కృతి సనన్‌తో పాటు లక్ష్మణుడు, ఆంజనేయుడి పాత్రలు ఉన్నాయి. అయితే పోస్టర్‌లో కళ ఏ మాత్రం లేదు. గ్రాఫిక్ పోస్టర్‌లాగే ఉండటంతో మరోసారి ‘ఆదిపురుష్’ మేకర్స్ మీద ట్రోల్స్ వచ్చాయి. అలాగే అందులో సీతమ్మ తల్లి మెడలో తాళి, ఆభరణాలు లేకపోవడం, కాళ్లకు మెట్టెలు లేకపోవడం, లక్ష్మణుడికి పూర్తిగా గడ్డం ఉండటంతో నెటిజన్స్ మళ్లీ ట్రోలింగ్ మొదలు పెట్టారు.
రామాయణం, రాముడు, సీత అంటే ప్రేక్షకుల్లో ఒక ఇమేజ్, అంచనాలు ఉంటాయి. వాటికి భిన్నంగా పురాణాలతో ప్రయోగాలు చేస్తానంటే కుదరదు అని నెటిజన్లు ఓం రౌత్ పై చివాట్లు కురిపిస్తున్నారు. మరికొందరు ఫ్యాన్స్ ఓం రౌత్ నీవు ఇక మారవా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ విమర్శలకు కారణం అయిన టీజర్ లో కూడా ఎక్కడా ఇది రామాయణం అనే భావన మచ్చుక కూడా కనిపించకుండా చూపించకపోవడమే. ఇక సైఫ్ అలీ ఖాన్ పోషిస్తున్న రావణుడి పాత్ర గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రావణుడి లుక్ ఎవరో మాయలఫకీరుని చూసినట్లు ఉందని, టెర్రరిస్ట్ లుక్ ల ఉందని దారుణంగా విమర్శలు చేశారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…