VC Sajjanar : ప్రస్తుత మార్కెట్లో యాడ్స్ అనేవి చాలా కీలకం. కంపెనీలు తమ ప్రాడక్ట్స్ ను అమ్ముకోవడం కోసం ఎన్నో ఎత్తులు పై ఎ్తతులు వేస్తాయి. కోట్లు పెట్టి సెలబ్రిటీలతో యాడ్స్ తీసి సొమ్ము చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే సెలబ్రిటీలు కూడా ఆ కంపెనీలు ఉత్పత్తి చేసే వస్తువులు, ప్రొడక్ట్స్ మంచివా, హానికరమైనవా చూడకుండా ప్రకటనల్లో నటించడం, తర్వాత చిక్కుల్లో ఇరుక్కుంటుండడం జరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కీలక అభ్యర్థన చేశారు.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సహా సెలబ్రిటీలందరికీ ‘ఆమ్వే’ లాంటి మోసపూరిత సంస్థలకు సహకరించొద్దని రిక్వెస్ట్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను, సమాజంలోని సామాజిక వ్యవస్థను నాశనం చేసే ఇలాంటి మోసపూరిత సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండొద్దంటూ అభ్యర్ధించారరు. అమితాబ్ లాంటి స్టార్ హీరోలు ఇలాంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించడం సరికాదన్నారు. ఆమ్వేకి బిగ్‌బీ ప్రచారం చేయడంపై ఆయన్ను ట్యాగ్ చేస్తూ సజ్జనార్ ఈ ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ ‘క్యూనెట్’ లాంటి సంస్థలకు సంబంధించిన యాడ్స్‌లలో నటించొద్దని, అలాంటి కంపెనీలను ప్రమోట్ చేయొద్దని సజ్జనార్ కోరిన విషయం తెలిసిందే.
ఆమ్వే కంపెనీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్ కు పాల్పడుతోందని ఈడీ 2022 లో ఆరోపించింది. ఆమ్వే ఆస్తులను సీజ్ చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఆమ్వే అనేది.. ఆరోగ్యం, సౌందర్యానికి సంబంధించి పలు ఉత్పత్తులను మార్కెట్ చేసే ఒక అమెరికన్ ఆధారిత సంస్థ కాగా, ఇది స్కామ్‌కు పాల్పడుతోందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గతేడాది ఏప్రిల్‌లో ఆరోపించింది. సంస్థ అసలు ఉద్దేశం ఉత్పత్తులను విక్రయించడం కాదని, గొలుసుకట్టు స్కీముల్లో ప్రజలను చేర్పించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కొన్నాళ్ల క్రితం ఆమ్వేకు చెందిన సుమారు రూ.757 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది ఈడీ.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…