Avatar 2 : అవ‌తార్ 2 బోరింగ్ సినిమా..? భ‌య‌పెట్టిస్తున్న రివ్యూలు..?

Avatar 2 : ప్ర‌పంచం మొత్తం ఇప్పుడు డిసెంబ‌ర్ 16న విడుద‌ల కానున్న అవ‌తార్ 2 కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంది. 13 ఏళ్ల క్రితం వచ్చిన హాలీవుడ్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్’ సీక్వెల్‌గా ఈ చిత్రం తెర‌కెక్క‌గా, అవతార్ -2 మూవీ ఓపెనింగ్ డే కలెక్షన్స్‌పై అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. అవతార్-2 మూవీ కోసం 4,41,960 మంది భారత్‌లో అడ్వాన్స్‌గా టికెట్లు బుక్ చేసుకోగా, ఇప్పటి వరకూ ఏ సినిమాకి కూడా ఇంతమంది అడ్వాన్స్‌గా టికెట్లు బుక్ చేసుకోలేదు. ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’ రికార్డులు క్రియేట్ చేయ‌డం ఖాయం అని భావిస్తుండ‌గా, ఈ సినిమాపై నెగిటివ్ రివ్యూలు మొదలయ్యాయి.

ప్రముఖ వెబ్‌సైట్‌ గార్డియన్‌ ఈ సినిమాకు కేవలం 2 రేటింగ్ మాత్రమే ఇవ్వ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంది. 30 నిమిషాల కార్టూన్‌తో చెప్పే స్టోరీని మూడు గంటలకుపైగా సాగదీసినట్లుగా ఉన్నదని గార్డియన్ కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఇక ది టెలిగ్రాఫ్‌ అయితే ఈ మూవీ కేవలం వన్‌ స్టార్‌ రేటింగే ఇవ్వ‌డంతో పాటు ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదని అనడం విశేషం. టైమ్‌ మ్యాగజైన్‌ కూడా ఈ సినిమాకు టూ స్టార్‌ రేటింగ్‌ మాత్రమే ఇచ్చింది. విజువల్స్‌ పరంగా అద్భుతంగా ఉన్నా.. చెప్పుకోవడానికి పెద్దగా స్టోరీ ఏమీ లేదని కొంత నెగెటివ్ రివ్యూలు అయితే ఇచ్చారు. చాలా బోరింగ్ గా ఉందని కొంద‌రు అంటున్నారు. బిబిసి వాళ్లు రివ్యూ ఇస్తూ ఈ సినిమా అంతగా ఎంగేజ్ చేయలేకపోయింది తేల్చారు.

Avatar 2 negative reviews makers worried
Avatar 2

సినిమాలో కొన్ని నెగిటివ్ అంశాలు ఉన్నా సినిమా చక్కగా మరియు అందంగా ఉందని కొంద‌రు అంటున్నారు. డైరక్టర్ కామెరాన్ టెక్నికల్ నాలెడ్జ్ అబ్బురపరిచే స్దాయిలో ఉండ‌గా, ఇందులో అత్యాధునిక CGI మరియు పెర్ఫామెన్స్ క్యాప్చర్, డిజిటల్ 3D, హైపర్-రియల్ క్లారిటీ మొదలైనవి ప్రేక్ష‌కులని ఉక్కిరిబిక్కిరి చేస్తాయట‌. అవతార్ 2’ ను రీసెంట్ గా లండన్ లో లిమిటెడ్ మెంబర్స్ కు ప్రివ్యూ వేసి చూపించారు. చూసిన ప్రతీ ఒక్కరు సినిమా అద్బుతం అంటూ ట్వీట్ చేశారు. ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’ మూవీ టెక్నికల్ గా ఎంతో గొప్పది. ఫస్ట్ పార్ట్ కన్నా ఎంతో ఎమోషనల్ గా ఉంది. స్టోరీ, స్ర్కీన్ ప్లే, స్పిరిట్యువాలిటీ, బ్యూటీ, మూవీ మేకింగ్, స్టోరీ టెల్లింగ్.. అన్నీ పెర్ఫెక్ట్ గా కుదిరి సినిమాని చాలా అందంగా తీర్చిదిద్దాయి అంటూ ఫేమస్ క్రిటిక్ ఎరిక్ డేవిస్ సినిమాపై తన అభిప్రాయాన్ని చెప్పాడు. అయితే కొందరు మాత్రం సినిమాపై చాలా నెగిటివ్ గా రియాక్ట్ కావ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago