Avatar 2 : ప్రపంచం మొత్తం ఇప్పుడు డిసెంబర్ 16న విడుదల కానున్న అవతార్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. 13 ఏళ్ల క్రితం వచ్చిన హాలీవుడ్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్’ సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కగా, అవతార్ -2 మూవీ ఓపెనింగ్ డే కలెక్షన్స్‌పై అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. అవతార్-2 మూవీ కోసం 4,41,960 మంది భారత్‌లో అడ్వాన్స్‌గా టికెట్లు బుక్ చేసుకోగా, ఇప్పటి వరకూ ఏ సినిమాకి కూడా ఇంతమంది అడ్వాన్స్‌గా టికెట్లు బుక్ చేసుకోలేదు. ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అని భావిస్తుండగా, ఈ సినిమాపై నెగిటివ్ రివ్యూలు మొదలయ్యాయి.
ప్రముఖ వెబ్‌సైట్ గార్డియన్ ఈ సినిమాకు కేవలం 2 రేటింగ్ మాత్రమే ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 30 నిమిషాల కార్టూన్‌తో చెప్పే స్టోరీని మూడు గంటలకుపైగా సాగదీసినట్లుగా ఉన్నదని గార్డియన్ కీలక వ్యాఖ్యలు చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇక ది టెలిగ్రాఫ్ అయితే ఈ మూవీ కేవలం వన్ స్టార్ రేటింగే ఇవ్వడంతో పాటు ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదని అనడం విశేషం. టైమ్ మ్యాగజైన్ కూడా ఈ సినిమాకు టూ స్టార్ రేటింగ్ మాత్రమే ఇచ్చింది. విజువల్స్ పరంగా అద్భుతంగా ఉన్నా.. చెప్పుకోవడానికి పెద్దగా స్టోరీ ఏమీ లేదని కొంత నెగెటివ్ రివ్యూలు అయితే ఇచ్చారు. చాలా బోరింగ్ గా ఉందని కొందరు అంటున్నారు. బిబిసి వాళ్లు రివ్యూ ఇస్తూ ఈ సినిమా అంతగా ఎంగేజ్ చేయలేకపోయింది తేల్చారు.
సినిమాలో కొన్ని నెగిటివ్ అంశాలు ఉన్నా సినిమా చక్కగా మరియు అందంగా ఉందని కొందరు అంటున్నారు. డైరక్టర్ కామెరాన్ టెక్నికల్ నాలెడ్జ్ అబ్బురపరిచే స్దాయిలో ఉండగా, ఇందులో అత్యాధునిక CGI మరియు పెర్ఫామెన్స్ క్యాప్చర్, డిజిటల్ 3D, హైపర్-రియల్ క్లారిటీ మొదలైనవి ప్రేక్షకులని ఉక్కిరిబిక్కిరి చేస్తాయట. అవతార్ 2’ ను రీసెంట్ గా లండన్ లో లిమిటెడ్ మెంబర్స్ కు ప్రివ్యూ వేసి చూపించారు. చూసిన ప్రతీ ఒక్కరు సినిమా అద్బుతం అంటూ ట్వీట్ చేశారు. ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’ మూవీ టెక్నికల్ గా ఎంతో గొప్పది. ఫస్ట్ పార్ట్ కన్నా ఎంతో ఎమోషనల్ గా ఉంది. స్టోరీ, స్ర్కీన్ ప్లే, స్పిరిట్యువాలిటీ, బ్యూటీ, మూవీ మేకింగ్, స్టోరీ టెల్లింగ్.. అన్నీ పెర్ఫెక్ట్ గా కుదిరి సినిమాని చాలా అందంగా తీర్చిదిద్దాయి అంటూ ఫేమస్ క్రిటిక్ ఎరిక్ డేవిస్ సినిమాపై తన అభిప్రాయాన్ని చెప్పాడు. అయితే కొందరు మాత్రం సినిమాపై చాలా నెగిటివ్ గా రియాక్ట్ కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.