Sonu Sood : సోనూసూద్ కి రివ‌ర్స్ అయిన నెటిజ‌న్స్.. అంత త‌ప్పు ఏం చేశాడ‌బ్బా..?

Sonu Sood : క‌రోనా స‌మ‌యంలో సోనూసూద్ పేరు ఎంత‌గా మారుమ్రోగిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సోను సూద్… రీల్ లైఫ్ విలన్ కాగా, రియల్ లైఫ్ హీరో గా ఎంతో మంది మ‌న‌సులు గెలుచుకున్నాడు. కరోనా కష్టకాలంలో ఎంతోమందికి సహాయం చేసి పెద్ద మనసు చాటుకున్న దేవుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్ నటుడు అయిన సోనుసూద్ కరోనా కష్టకాలంలో లాక్ డౌన్ విధించ‌డంతో వలస కార్మికులు తమ కుటుంబ సభ్యులను చేరడం కోసం ఏంతో సేవ చేశారు. ఆ సేవ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇప్ప‌టికీ సొనూసూద్ త‌న మాన‌వ‌త్వాన్ని చాటుకుంటూనే ఉన్నారు.

అయితే, తాజాగా సోనూ సూద్‌ చేసిన ఓ పనికి నెటిజన్లు ఆయ‌న‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వివరాల‌లోకి వెళితే డిసెంబర్‌ 13వ తేదీన సోనూసూద్‌ ఓ వీడియో పోస్టు చేశారు. అందులో కదులుతున్న రైల్లో సోనూసూద్‌ ఫుట్ బోర్డుపై కాస్త అజాగ్రత్తగా ప్రయాణిస్తూ కనిపించాడు. హ్యాండ్‌రైల్ పట్టుకుని కదులుతున్న రైలు తలుపు అంచున తన కాలి వేళ్లపై కూర్చొని.. రైలు నుంచి బయటకు చూస్తూ కనిపించాడు. 20 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ కాగా, ఇది చూసిన ప్ర‌తి ఒక్క‌రు సోనూసూద్‌పై మండిపడుతున్నారు.

netizen angry on Sonu Sood for the first time what he has done
Sonu Sood

‘కదులుతున్న రైలు డోర్ నుంచి బయటకు వేలాడటం చాలా ప్రమాదకరం..’, ‘ఇలాంటి వాటిని ప్రోత్సహించడం నటుడి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం’, ‘ఇలాంటి వీడియోలు సోషల్‌మీడియాలో పెట్టే ముందు క‌నీసం ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి’, ‘దేశవ్యాప్తంగా చాలా మందికి రోల్ మోడల్‌గా ఉన్న మీరు ఇలాంటి వీడియోలు సోష‌ల్ మీడియాలో పోస్టు చేయకూడదు’ అంటూ నెటిజ‌న్స్ తిట్టి పోస్తున్నారు. మ‌రి కొంద‌రు అత‌నిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా సోషల్ మీడియాలో ప్రస్తుతం సోనూసూద్ చేసిన వీడియో పై ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతోంది .ఎవరికి వారు తమదైన శైలిలో ఇది మంచి పని కాదు అంటూ సోనూసూద్ ను విమర్శిస్తుండ‌గా, దీనిపై ఆయ‌న ఏమ‌న్నా స్పందిస్తారా అన్న‌ది చూడాలి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago