Avatar 2 Movie Review : జేమ్స్ కెమరూన్ అద్భుత సృష్టి అవతార్ చిత్రం ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన 13 ఏళ్ల తర్వాత అవతార్ 2 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. అత్యాధునిక సాంకేతికతను జోడించి రూపొందించిన అవతార్- 2 సినిమాను అంతే స్థాయిలో వీక్షించేలా 3డీ గ్లాస్‌ను రూపొందించి ప్రేక్షకులకి అందిస్తున్నారు. కేట్ విన్స్‌లెట్, విన్ డిజీల్, స్టెఫాన్ వార్తింగ్టన్, జో సల్ానా, సామ్ వర్తింగ్టన్ చిత్రంలో తదితరులు నటించారు. కోవిడ్ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ ఏడాది చివర్లో రిలీజ్ అవుతున్నది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ:
జేక్ సల్లీ పండోరాలోని తెగకు చెందిన నాయకుని కూతురిని ప్రేమించడంతో మొదటి భాగం ముగుస్తుంది. పూర్తిగా నావి మనిషిలా మనిషిలా మారిన జేక్.. తన కుటుంబంతో కలిసి వేరే చోటుకు వలస వెళ్లగా, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుంటూ, ఆ తెగలో మనుషుల్లో ఒకరిగా ఉంటాడు. అయితే పండోరాలో స్కై మేన్ భూమిని ఆక్రమించుకోవడానికి వచ్చినట్లే, ఇక్కడ కూడా నీటిలో ఉన్న అపూర్వ సంపదని చేజిక్కుంచుకోవాలని ఓ సంస్థ ప్రయత్నిస్తూ ఉంటుందనే విషయం తెలుసుకుంటాడు.. ఈ క్రమంలో జేక్ సల్లీతో పాటు వాళ్ల తర్వాత జనరేషన్ కూడా తమపై అధికారం చెలాయించాలని చూసిన మనుషులపై ఎదురు తిరిగేందుకు స్కెచ్‌లు వేస్తుంది.. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి అని సినిమా చూస్తే తెలుస్తుంది.
పర్‌ఫార్మెన్స్ :
‘అవతార్ కంటే అవతార్ 2 ఇంకా గొప్పగా, పెద్దగా, ఎమోషనల్‌గా బావుంది. కేట్ విన్స్‌లెట్, విన్ డిజీల్, స్టెఫాన్ వార్తింగ్టన్, జో సల్ానా, సామ్ వర్తింగ్టన్ తదితరులుతమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రతి ఒక్కరు తమ పాత్రలలో పూర్తిగా ఒదిగిపోయి ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచారు.
జేమ్స్ కెమరూన్ మరోసారి తన సత్తా చూపించారు. నీళ్లలో మనకు తెలియని ప్రపంచంలోకి తీసుకెళ్లి మనల్ని ఆనందపరుస్తారు. అవతార్ 2లో భారత కథలు చోటు చేసుకున్నాయనిపిస్తుంది. జానపద కథలు కనిపిస్తాయి. టెక్నాలజీతో ప్రేక్షకులకి కనుల విందు కలిగించారు జేమ్స్. సినిమాలోని ప్రతి సీన్‌ని చాలా అందంగాచిత్రీకరించారు.
ప్లస్ పాయింట్స్:
మైనస్ పాయింట్స్:
ఫైనల్‌గా..
నిడివి ఎక్కువగా ఉన్నా కూడా దర్శకుడు జేమ్స్ కామెరాన్ ఈ సినిమాను ఎంతో అద్భుతంగా మలిచారు. ఇదో సినిమాటిక్ అద్భుతం. ప్రేక్షకులను మరో గ్రహం పైకి తీసుకెళ్లారు. అందరూ తప్పక చూడాల్సిన చిత్రం. 3డీలో అయితే ఈ సినిమా మహా అద్భుతంగా ఉంది. హై రేంజ్ టెక్నాలజీ ఉపయోగించి భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమా రూపొందించారు. చిత్రంలో VFX వర్క్స్ హైలైట్ అయ్యాయనే చెప్పాలి. చివరి గంట అయితే మిరమిట్లు గొలిపారు.పాత్రలను సూక్షంగా, ప్రపంచాన్ని చాలా రిచ్ గా చూపించారు. కథ ప్రేక్షకులని ఎంతగానో హత్తుకుంటుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…