Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి అతి త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడనే శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. దీంతో చరణ్ దంపతులకు బంధుమిత్రులు.. సెలబ్రెటీలు.. అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెప్పుకొచ్చారు. ఇక తాజాగా సోషల్ మీడియాలో తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేసింది ఉపాసన. ఇటీవల ఆమె పుట్టినింటికి వెళ్లినట్లుగా తెలుస్తుండగా, ఈ క్రమంలోనే తన తల్లితోపాటు.. అపోలో హాస్పిటల్ ప్రతినిధులతో కలిసి దిగిన ఫోటోను ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది.
నా జీవితంలో ముఖ్యమైన మహిళల ఆశీర్వాదంతో మాతృత్వంలోకి ఎంటర్ కావడం సంతోషంగా ఉంది అంటూ తన తల్లి, అమ్మమ్మ, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ తో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. మిస్సింగ్ అత్తమ్మ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ ఫోటోలో ఉపాసన తల్లి శోభనా కామినేనితో పాటు హాస్పిటల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి, అపోలో హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్ పర్సన్ ప్రీతారెడ్డి అలాగే ఆమె స్నేహితురాలు సునీతా రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం ఉపాసన పిక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాలతో బిజీగా ఉంటే.. ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. రామ్ చరణ్.. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 సినిమా చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. హీరోయిన్ అంజలి కీలకపాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. రానున్న రోజులలో రామ్ చరణ్ స్టన్నింగ్ సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…