Sundarakanda Aparna : వెంకటేష్ నటించిన సినిమాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా సుందరకాండ. 1992లో వచ్చిన ఈ సినిమాకి కె.రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు. తమిళ్ లో సుందరకాండం పేరుతో వచ్చిన సినిమాకి తెలుగు రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది. సుందరకాండ సినిమాకి ఎం.ఎం. కీరవాణి స్వరాలను అందించారు. సినిమా కథతో పాటు సంగీతం కూడా ప్రేక్షకులని ఎంతగానో కట్టిపడేసింది. అయితే ఒక స్టూడెంట్ టీచర్ ని ఇష్టపడితే ఎలా ఉంటుంది అని సాగే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా మీనా నటించగా, వెంకటేష్ ను ఇష్టపడే స్టూడెంట్ పాత్రలో అపర్ణ నటించారు.
అయితే అపర్ణ పాత్ర కోసం రాఘవేంద్రరావు ఓ స్టార్ హీరోయిన్‌ను తీసుకోవాలని అనుకున్నారు. అయితే ఆ పాత్రకు ఆమె అంతగా సూట్ కాకపోవడంతో ఓ కొత్త అమ్మాయి బాగుంటుందని..ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఓ రోజు నిర్మాత కెవివి. సత్యనారాయణ గారింటికి వెళ్లారు . అక్కడ ఉన్న ఓ అమ్మాయి ఆయనకు బాగా నచ్చేసింది. తన స్టూడెంట్ పాత్రకు ఆమె అయితేనే సూట్ అవుతుందని భావించారు. అయితే ఆ అమ్మాయి ఎవరో ? పైగా నిర్మాత ఇంట్లో ఉంది ? ఆమె సినిమాల్లో నటిస్తుందో ? లేదో ? కదా ? అనుకుని ఆయన మౌనంగా ఉండిపోయారు.
పది రోజుల తర్వాత ఆ పాత్ర కోసం రాఘవేంద్రరావు అడిషన్స్ నిర్వహించారు. ఆ ఆడిషన్స్ కోసం అపర్ణ కూడా వచ్చింది. ఇంకేముందు వెంటనే ఆమెను చూసిన రాఘవేంద్రరావు సెలక్ట్ చేసేశారు. నువ్వు ఎవరు అమ్మాయి ? అని ఆయన అడిగితే.. సార్ నా పేరు అపర్ణ. నేను నిర్మాత కెవివి. సత్యనారాయణ గారి మేనకోడలిని అని చెప్పిందట . దాంతో అసిస్టెంట్‌తో ఆమెను ఓకే చేసేయండని చెప్పేశారట రాఘవేంద్రరావు. ఈ సినిమాలో అద్భుతంగా నటించి అందరి మన్ననలు పొందింది. ఈ సినిమా తర్వాత ఆమెకు చాలా సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు వచ్చాయి. అయినప్పటికీ పెద్ద గా నటించలేదు. 2002లో పెళ్లి చేసుకుని అమెరికా చెక్కేసింది. ఇటీవల అపర్ణ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా అవి చూసి చాలా మంది షాక్ అయ్యారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…