Arti Agarwal : ఆర్తి అగ‌ర్వాల్‌.. ఆమె చేసిన ఆ ఒక్క త‌ప్పు వ‌ల్లే బ‌లి అయిపోయిందా..?

Arti Agarwal : ఆర్తి అగర్వాల్.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. విక్టరీ వెంకటేష్ తో నువ్వు నాకు నచ్చావ్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఆర్తి అగర్వాల్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. నువ్వు లేక నేను లేను, అల్లరి రాముడు, ప్రభాస్ అడవి రాముడు, ఇంద్ర వంటి చిత్రాలలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, వంటి స్టార్ హీరోలతోపాటు ఉదయ్ కిరణ్, తరుణ్ వంటి యంగ్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకొని సూపర్ డూపర్ హిట్స్ అందుకుంది.

ఇంకా బోలెడంత బ్రైట్ ఫ్యూచర్ ఉన్న తరుణంలోనే అర్ధాంతరంగా తనువు చాలించింది. అప్పట్లో ఆర్తి అగర్వాల్ మరణం ఓ సంచలనం. ఇప్పటికీ అది ఓ మిస్టరీనే. అమెరికాలో స్థిరపడిన ఒక గుజరాతీ ఫ్యామిలీలో న్యూ జెర్సీలో మార్చ్ 5, 1984లో జన్మించింది ఆర్తి అగర్వాల్. 14 సంవత్సరాల వయసులోనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించిన ఆర్తి అగర్వాల్ ఫిలడెల్పియాలోని ఓ స్టేజ్ షోలో ఆమె డాన్స్ చూసి ముచ్చట పడిన అమితాబ్ బచ్చన్.. ఆమెను హిందీలో యాక్ట్ చేయడానికి ఎంకరేజ్ చేశాడు. ఆ తర్వాత ఆర్తి అగర్వాల్ తెలుగులో ప్రముఖ దర్శకుడు కే విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావు అనే చిత్రం ద్వారా 16వ ఏటనే టాలీవుడ్ కి పరిచయమైంది. ఇక బ్యాక్ టు బ్యాక్ తెలుగులో సుమారు 50 కి పైగా సినిమాలలో నటించింది.

Arti Agarwal this may be the mistake for her death
Arti Agarwal

ఇక అనుకోకుండా 2017 జూన్ 6న తనువు చాలించింది ఆర్తి అగర్వాల్. అయితే వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో అనుకోకుండా కాస్త బరువు పెరిగింది ఈ ముద్దుగుమ్మ. ఆ కారణంగా ఈమెకు సినీ అవకాశాలు తగ్గిపోయాయి. ఆ సమయంలోనే కొన్ని పర్సనల్ విషయాలలో కూడా ఆమె కాస్త డిస్టర్బ్ అయిందని టాక్. ఇలా మనస్థాపానికి గురైన ఆర్తి ఎలాగైనా సరే బరువు తగ్గాలని వర్కౌట్లు చేయడం మొదలుపెట్టింది. అందులో భాగంగానే బరువు తగ్గేందుకు చేయించుకునే లైపోసెక్షన్ ఆపరేషన్ ని కూడా చేయించుకుంది. ఇక ఈ సర్జరీ తర్వాత కొంత కాంప్లికేట్ అయ్యి ఆపరేషన్ వికటించి గుండెపోటుతో ఆర్తి అగర్వాల్ అకాల మరణం చెందింది. ఏది ఏమైనా ఓ మంచి నటిని, అందగత్తెని మాత్రం వెండితెర కోల్పోయింద‌ని చెప్ప‌వ‌చ్చు.

Share
editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago