Arti Agarwal : ఆర్తి అగర్వాల్.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. విక్టరీ వెంకటేష్ తో నువ్వు నాకు నచ్చావ్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఆర్తి అగర్వాల్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. నువ్వు లేక నేను లేను, అల్లరి రాముడు, ప్రభాస్ అడవి రాముడు, ఇంద్ర వంటి చిత్రాలలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, వంటి స్టార్ హీరోలతోపాటు ఉదయ్ కిరణ్, తరుణ్ వంటి యంగ్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకొని సూపర్ డూపర్ హిట్స్ అందుకుంది.
ఇంకా బోలెడంత బ్రైట్ ఫ్యూచర్ ఉన్న తరుణంలోనే అర్ధాంతరంగా తనువు చాలించింది. అప్పట్లో ఆర్తి అగర్వాల్ మరణం ఓ సంచలనం. ఇప్పటికీ అది ఓ మిస్టరీనే. అమెరికాలో స్థిరపడిన ఒక గుజరాతీ ఫ్యామిలీలో న్యూ జెర్సీలో మార్చ్ 5, 1984లో జన్మించింది ఆర్తి అగర్వాల్. 14 సంవత్సరాల వయసులోనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించిన ఆర్తి అగర్వాల్ ఫిలడెల్పియాలోని ఓ స్టేజ్ షోలో ఆమె డాన్స్ చూసి ముచ్చట పడిన అమితాబ్ బచ్చన్.. ఆమెను హిందీలో యాక్ట్ చేయడానికి ఎంకరేజ్ చేశాడు. ఆ తర్వాత ఆర్తి అగర్వాల్ తెలుగులో ప్రముఖ దర్శకుడు కే విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావు అనే చిత్రం ద్వారా 16వ ఏటనే టాలీవుడ్ కి పరిచయమైంది. ఇక బ్యాక్ టు బ్యాక్ తెలుగులో సుమారు 50 కి పైగా సినిమాలలో నటించింది.
![Arti Agarwal : ఆర్తి అగర్వాల్.. ఆమె చేసిన ఆ ఒక్క తప్పు వల్లే బలి అయిపోయిందా..? Arti Agarwal this may be the mistake for her death](http://3.0.182.119/wp-content/uploads/2023/05/arti-agarwal.jpg)
ఇక అనుకోకుండా 2017 జూన్ 6న తనువు చాలించింది ఆర్తి అగర్వాల్. అయితే వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో అనుకోకుండా కాస్త బరువు పెరిగింది ఈ ముద్దుగుమ్మ. ఆ కారణంగా ఈమెకు సినీ అవకాశాలు తగ్గిపోయాయి. ఆ సమయంలోనే కొన్ని పర్సనల్ విషయాలలో కూడా ఆమె కాస్త డిస్టర్బ్ అయిందని టాక్. ఇలా మనస్థాపానికి గురైన ఆర్తి ఎలాగైనా సరే బరువు తగ్గాలని వర్కౌట్లు చేయడం మొదలుపెట్టింది. అందులో భాగంగానే బరువు తగ్గేందుకు చేయించుకునే లైపోసెక్షన్ ఆపరేషన్ ని కూడా చేయించుకుంది. ఇక ఈ సర్జరీ తర్వాత కొంత కాంప్లికేట్ అయ్యి ఆపరేషన్ వికటించి గుండెపోటుతో ఆర్తి అగర్వాల్ అకాల మరణం చెందింది. ఏది ఏమైనా ఓ మంచి నటిని, అందగత్తెని మాత్రం వెండితెర కోల్పోయిందని చెప్పవచ్చు.