AP Volunteer : గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్.. వారాహి యాత్రలో భాగంగా వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే వాలంటీర్ వ్యవస్థపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు అందే విధంగా చొరవ చూపించాల్సిన కొందరు వాలంటీర్స్ అక్రమాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లను ఓటర్ల తనిఖీల్లో వినియోగించడంపై ఏపీ ప్రభుత్వంపై పవన్ ప్రశ్నల వర్షం కురిపించారు. గత కొంతకాలంగా ఏపీ వాలంటీర్ వ్యవస్థపై చర్చ జరుగుతోంది. వాలంటీర్లు సేకరించిన వ్యక్తిగత సమాచారం ఎక్కడికి వెళ్తుందని పవన్ ప్రశ్నిస్తున్నారు.
వాలంటీర్లు తప్పుచేస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారని పవన్ నిలదీస్తున్నారు. వాలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలకు… కేసులు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయినా పవన్ వెనక్కి తగ్గడంలేదు. ఈ విషయంలో తగ్గేదేలే అంటున్న పవన్… కోర్టుల్లో తేల్చుకుంటామంటున్నారు. రోజు రోజుకి వాలంటీర్ల వ్యవస్థపై పవన్ మరింత దూకుడు పెంచారు. ఆదివారం పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా మూడు ప్రశ్నలు వేశారు. మై డియర్ వాట్సన్ అంటూ సీఎం జగన్‌ను సంబోధిస్తూ… అందరి ఆందోళన ఒక్కటే.. మీరు సీఎం అయినా, కాకపోయినా డేటా గోప్యత చట్టాలు మారవన్నారు. గతంలో వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు డేటా చౌర్యం గురించి మాట్లాడిన వీడియోను పవన్ షేర్ చేశారు.
ఆధార్, బ్యాంకు ఖాతా లాంటి వ్యక్తిగత సమాచారం ఎవరైనా ప్రైవేటు వ్యక్తి వద్ద ఉంటే అది క్రైమ్ అని గతంలో జగన్ అన్నారు. ఇప్పుడు ఆయన చేస్తుంది ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పవన్ కళ్యాన్ వాలంటరీ వ్యవస్థపై చేసిన కామెంట్స్ తో ప్రజలు సైతం అప్రమత్తం అయ్యారు. వాలంటీర్ పేరుతో తమ డేటాని తీసుకునేందుకు ఎవరు వచ్చిన వారిని గట్టిగా నిలదీస్తున్నారు. తాజాగా ఓ యువతి వాలంటీర్ అంటూ ప్రజల డేటా అంతా తీసుకుంటుండగా, ఓ వ్యక్తి నీ ఐడీ కార్డ్ ఏది, అపాయింట్‌మెంట్ లెటర్ ఏది, నువ్వు ప్రభుత్వానికి చెందిన వ్యక్తివని మాకు నమ్మకం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…