Rains : తెలంగాణ‌కి రెడ్ అల‌ర్ట్.. రానున్న మూడు రోజుల‌లో భారీ నుండి అతి భారీ వ‌ర్షాలు..

Rains : గ‌త నెల‌లో ఉక్క‌పోత‌తో ఉడికిపోయిన ప్ర‌జ‌ల‌కి వ‌ర్షాలు ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తున్నాయి. అయితే గ‌త వారం రోజులుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. తాజాగా రెడ్ అలర్ట్ ప్రకటించింది.25, 26, 27 తేదీల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఏకకాలంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు హెచ్చరిక జారీ అయింది.ఈ క్ర‌మంలో వచ్చే నాలుగు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచిస్తోంది. బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుండటంతో పాటు ఉపరితల ఆవర్తనం ఇప్పటికే ఆవహించి ఉండటం, మ‌రోవైపు నైరుతి రుతు పవనాలు బలపడటంతో వ‌ర్షాలు భారీగా కురుస్తున్నాయి.

heavy rains alert for telangana
Rains

తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చ‌రిక జారీ చేసింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్రలోని వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం జూలై 26 నాటికి వాయుగుండంగా మారనుంది. ఫలితంగా ఇవాళ్టి నుంచి వరుసగా నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్న‌ట్టు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరించింది.. రేపు హైదరాబాద్ నగరంలో ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. సోమవారం నాడు సాయంత్రం నుంచి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, యూసఫ్‌గూడ, అమీర్‌పేట్, వెంకటగిరి ప్రాంతాలతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. వర్షం కారణంగా పంజాగుట్ట నిమ్స్ దగ్గర, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముసురు కారణంగా జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరింది. హిమాయత్‌సాగర్‌ నాలుగు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 2750 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేశారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago