Anweshippin Kandethum : టోవినో థామస్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులు కొందరికి తెలుసు. వంద కోట్లకు పైగా వసూలు చేసిన ఆయన మలయాళ హిట్ ‘2018’ను తెలుగు డబ్బింగ్ చేశారు. థియేటర్లలో మంచి పేరు తెచ్చుకుంది. సూపర్ హీరో సినిమా ‘మిన్నల్ మురళి’కి తెలుగులో ఫ్యాన్స్ ఉన్నారు. టోవినో థామస్ మలయాళ సినిమాలను ఆహా ఓటీటీ డబ్బింగ్ చేసి తెలుగు వీక్షకుల ముందుకు తీసుకొస్తుంటారు. అయితే టోవినో థామస్ హీరోగా నటించిన లేటెస్ట్ మలయాళ సినిమా ‘అన్వేషిప్పిన్ కండతుమ్. చిత్ర కథ విషయానికి వస్తే ఆనంద్ నారాయణ్ (టోవినో థామస్) సబ్ ఇన్‌స్పెక్టర్. అతని స్టేషన్ పరిధిలో ఓ అమ్మాయి మిస్సింగ్ కేసు నమోదు అవుతుంది.
హంతకుడిని ఆనంద్ మరియు అతని టీం పట్టుకుంటుంది. అయితే… అనూహ్య పరిణామాల కారణంగా వాళ్లందరూ సస్పెండ్ కాగా, జనం ముందు ఆనంద్ దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే కొన్నాళ్లకు ఎస్పీ (సిద్ధిఖీ) ఆనంద్ & టీంను పిలిచి మరో కేసు అప్పగిస్తారు. లోకల్ పోలీసులు, క్రైమ్ బ్రాంచ్, సిట్ టీం ఇన్వెస్టిగేషన్ చేసినా… శ్రీదేవి (అర్తన బిను) మర్డర్ కేసును సాల్వ్ చేయలేకపోతారు. శ్రీదేవి హంతకులు ఎవరో గనుక పట్టుకోగలిగితే ముందు జరిగిన కేసును జనం మర్చిపోతారని ఎస్పీ చెబుతారు. శ్రీదేవి కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్లిన ఆనంద్ & టీంకు ఆ ఊరి ప్రజలు ఎందుకు సహకరించలేదు? అమ్మాయి మిస్సింగ్ కేసులో ఆనంద్ & టీం ఎందుకు సస్పెండ్ అయ్యింది? అనేది సినిమా చూస్తే అర్ధమవుతుంది.
అయితే ఈ సినిమాలో హీరో పోలీస్ ఆఫీసర్. సాధారణ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటారో? అలా టోవినో థామస్ పాత్రను చూపించారు ..’అన్వేషిప్పిన్ కండతుమ్’లో స్పెషాలిటీ ఏమిటంటే… ప్రేక్షకుల ఊహకు అందని ట్విస్టులు సర్‌ప్రైజ్ చేస్తాయి. ఫస్టాఫ్‌లో లిల్లీ మర్డర్ కేసులో గానీ… సెకండాఫ్‌లో శ్రీదేవి మర్డర్ కేసులో గానీ చాలా హజత్వానికి దగ్గరగా తీశారు. ఫస్టాఫ్ సాగినంత వేగంగా సెకండాఫ్ ముందుకు వెళ్లలేదు. ఇన్వెస్టిగేషన్స్‌లోనూ ట్విస్ట్స్ బావున్నాయి. ఆ ట్విస్ట్స్ వచ్చే వరకు కొన్ని రొటీన్ సీన్స్ కూడా ఉన్నాయి. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఏ దశలోనూ క్యారెక్టర్ పరిధి దాటి బయటకు వెళ్ళలేదు. ఓ సాధారణ ఎస్సై మాత్రమే ప్రేక్షకులకు కనిపిస్తారు. క్రైమ్ డ్రామా, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ చూడాలని కోరుకునే ప్రేక్షకులకు ‘అన్వేషిప్పిన్ కండతుమ్’ బెస్ట్ ఆప్షన్. రెండున్నర గంటల పాటు సినిమాని చక్కగా ఎంజాయ్ చేయవచ్చు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…