Mohammed Siraj : టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. హైదరాబాద్‌కి చెందిన ఈ బౌలర్ కెరీర్‌లో ఎన్నో ఇబ్బందులు పడి ఈ స్థాయికి ఎదిగాడు. ఇటీవల సిరాజ్ తన పుట్టి రోజు జరుపుకున్నాడు. ఈ క్రమంలో బీసీసీఐతో పాటు క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు.అయితే సిరాజ్ బర్త్ డే సందర్భంగా ఆయనకి సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.బీసీసీఐ సిరాజ్‌కి సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేయగా, ‘నా కుటుంబ సభ్యులు చదువుకోవాలని పట్టుబట్టారు. అయితే మేం అద్దె ఇంట్లో నివాసముండే వాళ్లం. ఇంట్లో మా నాన్న మాత్రమే సంపాదిస్తున్న వ్యక్తి.
కాబట్టి ఆయనకు తోడుగా నేను పనికి వెళ్ళేవాడిని. ఒక క్యాటరింగ్ లో చేరాను. అక్కడ రుమాలీ రోటీలు కాల్చేవాడిని. ఈ ప్రయత్నంలో చాలా సార్లు నా చేతులు కాలిపోయాయి. రోజుకు రూ. 200 వస్తే 150 రూపాయలు ఇంట్లో ఇచ్చేవాడిని. మిగతా 50 రూపాయలు నా దగ్గరే ఉంచుకునేవాడిని’ అని ఎమోషనల్ అయ్యాడు సిరాజ్. నాన్న ఆటో రిక్షా తోలుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. దీంతో, ఆయనకు సాయంగా ఉండాలనుకున్నా. తొలి రోజుల్లో క్యాటరింగ్ పనులు చేసేవాడిని . టెన్నిస్ క్రికెట్ ఎక్కువగా ఆడటం పేస్ ను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడింది. కఠినంగా శ్రమిస్తే ఏదో ఒక రోజు ఫలితం దక్కుతుంది. నాలుగేళ్ల క్రితం క్రికెట్ వదిలేద్దామనుకున్నా. సక్సెస్ కాకపోతే అదే నా చివరి సంవత్సరం అనుకున్నా. అయితే ఫామ్ లోకి రావడంతో జట్టులో స్థానాన్ని నిలబెట్టుకున్నా” అని సిరాజ్ తెలిపాడు.
మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. అతను బీసీసీఐ ‘ఏ’ గ్రేడ్ ప్లేయర్ కూడా. ఇప్పటివరకు భారత్ తరఫున 27 టెస్టులు, 41 వన్డేలు, 10 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. భారత్ కు ఎన్నో విజయాలు అందించాడు. ఇప్పుడు ఐపీఎల్ కోసం సన్నద్ధం అవుతున్నాడు. ఆర్సీబీకి కీ బౌలర్‌గా ఉన్న సిరాజ్ త్వరలో టీ20 వన్డే ప్రపంచ కప్ కోసం ఆడబోతున్నట్టు తెలుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…