Nita Ambani : నీతా అంబానీ.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య మాత్రమే కాదు.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, సోషల్ వర్క్ వంటి అనేక రంగాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా ఆమె తన స్టైల్, ఫ్యాషన్‌తో అభిమానులను కట్టిపడేస్తుంది. యాభై ఏళ్ల వయసులో ఎంతో ఎనర్జిటిక్‌గా నడుస్తున్న నీతా డ్యాన్స్‌కి, ఫిట్‌నెస్‌కి ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. నీతా ఆహారంలో పండ్లు, కూరగాయలు, గింజలు, విత్తనాలు మొదలైనవి ఎక్కువగా ఉంటాయట.
రోజూ ఉదయాన్నే వాకింగ్, బ్రేక్‌ఫాస్ట్‌లో నట్స్, పండ్లు, తాజాగా కూరగాయలు తప్పక తీసుకుంటారట. నీతా అంబానీ తన డైట్‌లో తప్పనిసరిగా ఒక గ్లాసు బీట్‌రూట్ జ్యూస్ తీసుకుంటారు. ఆమె పుష్కలంగా నీరు తాగుతారు. తన ఆహారంలో ఆకు కూరలు, పండ్లు పుష్కలంగా ఉండేలా చూసుకుంటారు. రాత్రిపూట క్రమం తప్పకుండా వెజిటబుల్ సూప్ తీసుకుంటారు. నీతా ప్రతిరోజూ వ్యాయామం, యోగా తప్పనిసరిగా చేస్తారు. ఇదండీ.. నీతా అంబానీ బ్యూటీ ఫిట్‌నెస్ సీక్రెట్. అయితే నీతా అంబాని గురించి కొన్ని విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.
1985లో ముఖేష్ అంబానీతో వివాహమైన ఒక సంవత్సరం తర్వాత, ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. పాఠశాల ఉపాధ్యాయురాలిగా తాను నెలకు 800 రూపాయల జీతం అందుకున్నట్టు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. కొంతమంది తనను ఎగతాళి చేసినా, ఆమె తన పనిలో సంతృప్తిని పొందింది. అయితే తాను జాబ్ చేసిన పొందిన ఆదాయం అంతా డిన్నర్‌కి ఖర్చు చేసినట్టు పేర్కొంది. ఆమె 2003లో ముంబయిలో ‘ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్’ని స్థాపించారు, దానికి తన దివంగత మామగారి పేరు పెట్టారు. ఆమె నిబద్ధతకు ఈ పాఠశాల ఎంతో నిదర్శనంగా నిలుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…