Indian Cricketers : శాల‌రీ క్యాప్ లేక‌పోతే మ‌న ప్లేయ‌ర్ల‌కు ఐపీఎల్ వేలంలో ఎంత వ‌స్తుందో తెలుసా..?

Indian Cricketers : మ‌రి కొద్ది రోజుల‌లో ఐపీఎల్ 2024 ఘ‌నంగా ప్రారంభం కానుంది. ధ‌నాధ‌న్ షాట్స్‌తో బ్యాట్స్‌మెన్స్, మెరుపు వేగంతో బౌల‌ర్స్ బంతులు విసురుతూ క్రికెట్ ప్రేమికుల‌కి మంచి మ‌జా అందిస్తుంటారు. మార్చి 22న స్టార్ట్ కానున్న ఈ టోర్నీలో తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్. ఇక ఇప్పటికే ప్లేయర్లు తమ ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ శిబిరాల్లోకి చేరి, ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. అయితే ఈ సీజన్ కు సంబంధించి గతేడాది జరిగిన మినీ వేలంలో ప్లేయర్లపై ఫ్రాంచైజీలు కోట్ల వర్షం కురిపించడం మ‌నం చూశాం.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ లో ఆ రూల్ తీసేస్తే.. ఆ ప్లేయర్లు కచ్చితంగా రూ. 100 కోట్లకు అమ్ముడుపోతారని చెప్పుకొచ్చాడు. ఈసారి జట్టులో ఇద్దరు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లను ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరలకు కొనుగోలు చేశారు. మిచెల్ స్టార్క్ ను కోల్ కతా నైట్ రైడర్స్ రూ.24.75 కోట్లకు, పాట్ కమిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ .20.50 కోట్లకు కొనుగోలు చేశాయి. ఈ క్ర‌మంలో ఊత‌ప్ప మాట్లాడుతూ.. ఐపీఎల్ లో ఫ్రాంచైజీలకు కళ్లెం వేయకపోతే, నిబంధనలు విధించకపోతే ఐపీఎల్ సినిమా మామూలుగా ఉండదని అన్నాడు. అదేగానీ జరిగితే టీమ్ఇండియాలో టాప్ 10 ప్లేయర్లు ఒకొక్కరు రూ.100 కోట్లు పలుకుతారని అన్నాడు.

do you know how much our Indian Cricketers will get in ipl auction
Indian Cricketers

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఒకొక్క ఫ్రాంచైజీ ఆటగాళ్లు అందరికీ కలిపి రూ. 100 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టాలని నిబంధన ఉంది. ఫ్రాంచైజీలకు రూ. 500 కోట్ల నుంచి రూ. 1000 కోట్ల లిమిట్ ఉంటే ఇది జరుగుతుంది. ఈ లిస్ట్ లో ఫస్ట్ పేరు జస్ప్రీత్ బుమ్రాది కాగా.. తర్వాత విరాట్, రోహిత్, పాండ్యా, సూర్యకుమార్, జైస్వాల్, గిల్ 100 కోట్ల ధర దక్కించుకుంటారు” అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ఊతప్ప.అలాగే కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజాలు రూ. 80 నుంచి 100 కోట్ల మధ్యన అమ్ముడవుతారని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఊతప్ప చేసిన ఈ వ్యాఖ్యలు ఐపీఎల్ లో ఆసక్తికరంగా మారాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago