Anushka Shetty : టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ అనుష్క శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. 2005లో తెలుగు చలన చిత్రం సూపర్ తో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు డైనమిక్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ మూవీ విక్రమార్కుడు మూవీలో నటించింది. లక్ష్యం, శౌర్యం, చింతకాయల రవి తదితర చిత్రాలన్నీ బాక్సాఫీసుల వద్ద దుమ్ము రేపాయి. ఉత్తమ నటి గా ఫిలిం ఫేర్ అవార్డు పొందింది. 2010లో అనుష్క శెట్టి తమిళంలో నటించిన వేట్లై కారన్ , సింగం, సింగం-2 , యెన్నై అరిందాల్ యాక్షన్ చిత్రాలు మంచి గుర్తింపు పొందాయి. భారీ సక్సెస్ సాధించాయి. వానం, దైవ తిరుమగల్ , సైజ్ జీరో సినిమాలలో నటనకు ప్రశంసలు దక్కాయి.
ఎస్ఎస్ రాజమౌళి తీసిన బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి, బాహుబలి-2 లో దేవసేన పాత్రలో లీనమై నటించింది. ఈ రెండు చిత్రాలు అత్యధిక వసూళ్లు సాధించాయి. ఈ సినిమాతో అనుష్కి మంచి పేరు కూడా వచ్చింది. అయితే ఈ సినిమా తర్వాత అనుష్క బాగా బరువు పెరగడం పెద్దగా సినిమాలు చేయకపోవడం మనం చూశాం. ఇటీవల భాగమతి, నిశ్శబ్ధం వంటి చిత్రాలతో అనుష్క పలకరించిన కూడా అవి పెద్దగా అలరించలేకపోయాయి.తాజాగా ఈ అమ్మడు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేసింది. ఈ సినిమా తరువాత అనుష్క సినిమాలు మానేస్తోంది అని ప్రచారం జరుగుతోంది.
ఇదే ఆమెకు ఆఖరి మూవీ అని టాలీవుడ్ కోడై కూస్తోంది. ప్రస్తుతం అనుష్కకు పెద్దగా అవకాశాలు లేవు.. దాంతో అవకాశాల కోసం పాకులాడకుండా. రెస్ట్ తీసుకోవాలని అనుకుంటుందట టాలీవుడ్ జేజమ్మ. ఇక మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా కోసం అనుష్క బాగానే కష్టపడి నట్టు తెలుస్తుంది. ఒక మేకింగ్ వీడియో విడుదల చేయగా, ఇందులో అనుష్క నాన్ వెజ్, పిజ్జాలు, బర్గర్‌లు కుమ్మెస్తూ కనిపించింది. చిత్రంలో అనుష్క పాత్ర కాస్త లావుగా ఉండాల్సిన నేపథ్యంలో ఇలా ఆమెతో తినిపించారట.మరి అనుష్క ఇంత కష్టపడగా,ఆ సినిమా మూవీకి ఎంత విజయం సాధిస్తుందో చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…