Samantha : మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత సినిమాలకి బ్రేక్ ఇచ్చి విహార యాత్రకి వెళ్లింది. తన ఫ్రెండ్స్‌తో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది.తన ఆరోగ్యం మీద పూర్తి దృష్టి పెట్టిన సమంత.. మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తోంది. అలాంటి పనులు చేస్తోంది. ఈషా షౌండేషన్‌లో ధ్యానం, జిమ్‌లో వర్కౌట్లు, బాలిలో వెకేషన్ ఇలా ఏం చేసినా కూడా తన హెల్త్‌ను, మైండ్‌ను సెట్ చేసుకునే ప్రయత్నంలో భాగమే అంటుంది. ప్రస్తుతం తాను ఒప్పుకున్న కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసింది. విజయ్ దేవరకొండ ఖుషి సినిమాను పూర్తి చేసింది.
రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసింది. ఇక సెట్స్ మీదకు రాని సినిమాలకు తీసుకున్న అడ్వాన్సులను తిరిగి వెనక్కి ఇచ్చింది. అలా చేయడంతో సమంత దాదాపు పది నుంచి పన్నెండు కోట్లు నష్టపోయినట్టు సమాచారం. అయితే స్నేహితులతో బాలీ ట్రిప్‍కు వెళ్లిన సమంత అక్కడ తన ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో సమంత డ్యాన్స్ చేసింది. తన స్నేహితురాలితో కలిసి చాలా గ్రేస్‍గా స్టెప్స్ వేసింది. ఈ వీడియోను తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది.
వెకేషన్ కి వెళ్లిన సమంత అక్కడ తన స్నేహితురాలితో కలిసి చిల్ అవుతోంది. భూతల స్వర్గమని, అక్కడి సూర్యోదయం ఎంతో అందంగా ఉందని, బాల్కనీలో కూర్చుని రోజూ సూర్యోదయాన్ని వీక్షిస్తున్నాను అన్నట్టుగా సమంత ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో నెట్టింట్లో బాగానే చక్కర్లు కొడుతోంది. “గర్ల్స్ ట్రిప్ 100/100” అంటూ ఈ వీడియోను సమంత నేడు పోస్ట్ చేసింది. తన స్నేహితురాలితో కలిసి సమంత చేసిన డ్యాన్స్ పర్‌ఫెక్ట్‌గా ఉంది. వైట్ టాప్, డెనిమ్ బాటమ్ వేసుకొని సమంత అందంగా కనిపించింది. స్టైలిష్, ఎనర్జిటిక్‍గా డ్యాన్స్ చేసింది. సరికొత్త షార్ట్ హెయిర్ స్టైల్‍తో డిఫరెంట్ లుక్‍లో ఉంది. సమంత పోస్ట్ చేసిన ఈ వీడియోకు మూడు గంటల్లోనే మిలియన్‍కు పైగా లైక్స్ వచ్చాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…