Chandra Babu : వీడియో చూపించి మ‌రీ అనీల్ కుమార్ యాద‌వ్‌కి గ‌ట్టిగా ఇచ్చి ప‌డేసిన చంద్ర‌బాబు

Chandra Babu : ఏపీ రాజకీయాల్లో ట్రెండ్ మారిన‌ట్టు క‌నిపిస్తుంది. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ఏపీ అసెంబ్లీ వేదికగా ప్రజంటేషన్లతో అటు ఎమ్మెల్యేలను, ప్రజలను ఆకట్టుకున్న జగన్‌ స్ట్రాటజీని ఇప్పుడు చంద్రబాబుకూడా మొదలుపెట్టారు. ఆయ‌న తాజాగా రాయలసీమ ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇస్తూ.. అధికార పార్టీపై విమర్శులు ఎక్కుపెట్టారు. ముఖ్యంగా పోల‌వ‌రం ప్రాజెక్ట్ విష‌యంలో చంద్ర‌బాబు అద్భుత‌మైన ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. జ‌గ‌న్, విజ‌య్ సాయి రెడ్డి, అనీల్ కుమార్ యాద‌వ్, అంబ‌టి రాంబాబు వంటి వారు 2021లో నే పోల‌వ‌రం పూర్తి చేస్తామ‌ని గ‌తంలో చెప్పుకొచ్చారు.

వారి వీడియోల‌ని చూపిస్తూ చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. వీళ్లకి న‌వ్వులాట అయిపోయింది. మాట మీద ఉండ‌రు. వీరు నాయ‌కులు. వీరితో మ‌నం తిట్టించుకోవాలి అంటూ మండిప‌డ్డారు. జగన్‌ తన అసమర్థతతో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా పడుకోబెట్టారు. ఈ అసమర్థుడి పాలనను ఇంకా ఈ రాష్ట్రం భరించాలా’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో కేవలం రూ.4,300 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ‘మేం 96 శాతం పనులు పూర్తి చేసిన చోట మిగిలిన 4 శాతం పనులను కూడా ఈ నాలుగేళ్లలో చేయలేదు.

Chandra Babu played anil kumar yadav video
Chandra Babu

పోలవరం పూర్తి చేసి గోదావరి జలాలను పెన్నా వరకూ తీసుకెళ్తే సాగర్‌ కుడి కాలువ, ఎడమ కాలువల కింద మొత్తం ఆయకట్టుకు నీరు ఇవ్వడంతోపాటు రాయలసీమకు కూడా చాలినంత నీరు ఇవ్వగలిగేవాళ్లం. కృష్ణా డెల్టా, సాగర్‌ కుడి, ఎడమ కాల్వల ఆయకట్టుకు పట్టి సీమ, చింతలపూడి, వైకుంఠపురం ప్రాజెక్టుల ద్వారా గోదావరి జలాలు ఇస్తే కృష్ణాలో 300 టీఎంసీల నీరు ఆదా అవుతుంది. ఆ నీటిని రాయలసీమకు మళ్లిస్తే ఆ ప్రాంతం కరువు తీరుతుంది. ఇంత పెద్ద ప్రణాళికతో మేం పనిచేస్తే జగన్‌ ఒక్క పనీ కూడా పూర్తి చేయకుండా సర్వనాశనం చేశాడు’ అని విరుచుకుపడ్డారు. మేం 64 ప్రాజెక్టులు చేపట్టి అందులో 23 పూర్తి చేశాం. వైసీపీ ఒక్కటి కూడా కొత్తగా చేపట్టింది లేదు. నడుస్తున్న వాటిలో ఒక్కటీ పూర్తి చేసింది లేదు అని చంద్ర‌బాబు అన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago