Anu Emmanuel : అల్లు వారబ్బాయి అల్లు శిరీష్‌కి సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఆయనకు అల్లు ఫ్యామిలీతో గొడవలు పడ్డాడని, విదేశాలలో ఉంటున్నాడని, అను ఇమ్యాన్యుయేల్‌తో ప్రేమాయణం నడుపుతున్నాడని ఇలా ప్రచారాలు జరిగాయి. అయితే తాజాగా అను ఇమ్యాన్యుయేల్‌తో తన ప్రేమాయణంకి సంబంధించి పూర్తి క్లారిటీ ఇచ్చాడు. ఇలాంటి వివాదాలు చాలా సాధారణం. కో స్టార్ తో ప్రేమలో ఉన్నానని వార్తలు రావడం సహజం. గతంలో కూడా నా గురించి ఇలాంటి వార్తలు వచ్చాయి.
నిజానికి మా ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదు. మేము మంచి స్నేహితులం మాత్రమే. కొన్ని నెలలు కలిసి పని చేసాం కాబట్టి మా మధ్య కొంత అనుబంధం ఉంది. మా ఇద్దరి వ్యక్తిత్వాలు ఒకేలా ఉంటాయి. తను చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది. రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు అందుకే ఇబ్బంది పడలేదు. ఇలాంటి తప్పుడు పుకార్లకి దూరంగా ఉండాలని సోషల్ మీడియా కి కూడా దూరమయ్యాను అంటూ స్పష్టం చేశారు అల్లు శిరీష్.ఇక ఏబిసిడి: అమెరికన్ రిటర్న్ కన్ఫ్యూజ్డ్ దేసి” అనే సినిమాతో డిజాస్టర్ అందుకున్న అల్లు శిరీష్ కొన్ని నెలలపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండగా, ఇప్పుడు “ఊర్వశివో-రాక్షసివో” అనే సినిమాతో పలకరించబోతున్నాడు.
జీఏ2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై ఈ ఉర్వశివో రాక్షసివో సినిమా రూపొందుతోంది. రాకేష్ శశి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించారు. రీసెంట్ గా ఈ చిత్ర టీజర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ప్యార్ ప్రేమ కాదల్ అనే తమిళ చిత్రానికి రీమేక్ గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పని విషయంలో అను చాలా ప్రొఫెషనల్ గా ఉంటుందని, రొమాంటిక్ సన్నివేశాల్లో ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ ఐందనై అన్నారు శిరీష్. ఈ సినిమాను నవంబర్ 4న విడుదల చేయనున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…