Anantha Sri Ram : ప్రస్తుతం ఏపీలో రాజకీయం చాలా వాడి వేడిగా ఉంది.మీటింగ్స్‌లోను, ప్రెస్ మీట్స్ లోను, సోషల్ మీడియాలోను ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మధ్యలో వేరే వ్యక్తులని కూడా లాగుతున్నారు. తాజాగా అనంత శ్రీరామ్‌ని కూడా ఇందులోకి లాగారు. దాంత ఆయన వివరణ ఇచ్చుకోవల్సి వచ్చింది. పొలిటికల్ మిసైల్ అనే సోషల్ మీడియా అకౌంట్లలో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై దారుణమైన పోస్ట్‌లు పెడుతున్నారు. వైఎస్సార్‌ను అవమానపరుస్తూ, ఆయనకి వ్యతిరేకంగా ఈ పోస్టులు ఉంటున్నాయి.
పొలిటికల్ మిసైల్ అనే అకౌంట్లను జనసైనికులు నడిపిస్తున్నారని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. ఇదే క్రమంలో ఇందులో సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ పేరు హస్తం కూడా ఉందని వారు కామెంట్ చేశారు. అనంత శ్రీరామ్ ఈ వ్యాఖ్యలు రాసి ఇస్తున్నారని ప్రచారం మొదలు కాగా, దీనిపై అనంత శ్రీరామ్ స్పందించాల్సి వచ్చింది. నాటా సభల్లో పాల్గొనడానికి అమెరికా వెళ్లిన అనంత శ్రీరామ్.. అక్కడి నుంచే ఒక వీడియో మెసేజ్‌ను సోషల్ మీడియాలో పెట్టారు. వైఎస్సార్‌కు వ్యతిరేకంగా వస్తున్న రాతల వెనుక, పోస్టుల వెనుక తాను లేనని ఆయన స్పష్టం చేశారు.
దివంగత ముఖ్యమంత్రి, మహానేత శ్రీ వైఎస్ రాజశేఖరరెడ్డి గారికి వ్యతిరేకంగా, ఆయన్ని అవమానపరిచేలా పొలిటికల్ మిసైల్ అన్న ఖాతాలో కొన్ని రాతలు రాస్తూ పోస్టులు పెడుతున్నారు. ఆ రాతల వెనుక, పోస్టుల వెనుక ఉన్నది నేనే అని చెప్పి వదంతులు వ్యాపించాయి. నాకు.. ఆ రాతలకు, పోస్టులకు ఏమాత్రం సంబంధం లేదు. నేను అన్ని పార్టీలకు పాటలు రాస్తాను. అది నా వృత్తి. అంతేకానీ, ఏ పార్టీ మీద వ్యక్తిగతంగా నాకు ఏ అభిప్రాయం లేదు. అవన్నీ నమ్మొద్దని వైసీపీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాను’ అని వీడియోలో అనంత శ్రీరామ్ వెల్లడించారు. ఒకవేళ భవిష్యత్తులో రాజకీయాల మీద ఎలాంటి అభిప్రాయాలు తెలియజేయాల్సి వచ్చినా నిక్కచ్చిగా నిర్భయంగా తన అధికారిక సామాజిక మాధ్యమాల్లోనే తెలియజేస్తాను అని అనంత శ్రీరామ్ స్పష్టం చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…