Anant Ambani Marriage : ఆషాఢంలో అంబానీ ఇంట పెళ్లి వేడుక జ‌ర‌ప‌డ‌మేంటి.. అస‌లు కార‌ణం ఇదా..?

Anant Ambani Marriage : గ‌త కొద్ది రోజులుగా అనంత్, రాధికాల వివాహ వేడుక‌కి సంబంధించిన వార్త‌లు నెట్టింట ఎంత వైర‌ల్ అవుతున్నాయో మ‌నం చూస్తున్నాం. ఇక జూలై 12న ఈ జంట వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. కొన్ని నెలలుగా అనంత్ అంబానీ – రాధికా మర్చంట్‌ల వివాహానికి సంబంధించిన వేడుకలు జరుగుతున్నాయి. అనేక కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి పెళ్లి ఘట్టం ముగిసింది. ఇక విందు మాత్రమే మిగిలివుంది. ఇవాళ (శనివారం) ఎంపిక చేసిన కొంతమంది సన్నిహిత అతిథులకు విందు కార్యక్రమాన్ని సిద్ధం చేశారు. రేపు (ఆదివారం) గ్రాండ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు.అనంత్ అంబానీ ప్రత్యేకంగా డిజైన్ చేసిన నారింజ రంగు షేర్వానీ ధరించారు. తన నివాసం యాంటిలియా నుంచి సుందరంగా అలంకరించిన ఎరుపు రంగు కారుపై సంగీతం, నృత్యాల మధ్య ఊరేగింపుగా కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నారు.

అనంతరం హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. బారాత్ ఊరేగింపులో కేవలం సంప్రదాయ ఆచారాలకే పరిమితం కాలేదు. పలువురు సెలబ్రిటీలు డ్యాన్స్ చేశారు. అమెరికా నటుడు, రాపర్ జాన్ సెనా, సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, రణవీర్ సింగ్‌తో పాటు పెళ్లి కొడుకు అనంత్ అంబానీ కూడా డ్యాన్స్ వేశారు. ఇక కింగ్ షారుఖ్ ఖాన్ నీతా అంబానీతో కలిసి చేసిన డ్యాన్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఆషాఢ మాసంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.. చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి ఘనంగా జరుగుతోంది. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం ముంబైలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.

Anant Ambani Marriage why doing in ashadham month
Anant Ambani Marriage

ఆషాఢ మాసంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.. చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి జ‌ర‌గ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. మ‌నం మూఢంగా భావించే మాసంలో ఇలా పెళ్లి చేసుకోవ‌డంపై అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అయితే అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహ ముహూర్తాన్ని దృక్‌గణితం ఆధారంగా రూపొందించిన సూర్యమాన పంచాంగం ప్రకారం పండితులు నిర్ణయించారు. దక్షిణ భారతదేశంలో చంద్రుడి కదలికలు.. ఉత్తర భారతదేశంలో సూర్యుడి కదలికల ఆధారంగా పంచాంగాన్ని రూపొందించారు. అందుకే ఆషాఢ మాసంతో సంబంధం లేకుండా ఒక శుభ ముహూర్తాన్ని చూసి పెళ్లి జరిపిస్తున్నారు. అయితే పంచాంగం ప్రకారం కూడా ఈ ముహూర్తం మంచిదేనని పలువురు పండితులు చెబుతున్నారు.సూర్యమానం ప్రకారం శుక్రవారం మేషరాశిలో.. చంద్రుడి సంచారం.. సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం చేస్తూంటాడు. ఇక చంద్రుడు పగలు, రాత్రి వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ ముహూర్తంలో వివాహానికి అత్యంత శుభప్రదమని సూర్యమానం పంచాంగం చెబుతోంది.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago