Kamal Haasan Remuneration : భార‌తీయుడు 2 కోసం క‌మ‌ల్ హాస‌న్‌కి ఊహించ‌ని పారితోషికం అందించారా..!

Kamal Haasan Remuneration : లోక‌నాయుడు క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్రలో స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కించిన చిత్రం భార‌తీయుడు2. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రం పెద్ద విజ‌యం సాధించింది. శంక‌ర్ మూడో చిత్రంగా తెరకెక్కిన మూవీ భారతీయుడు. తండ్రి, కొడుకులుగా కమల్ హాసన్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో కమల్ హాసన్ స్వాతంత్ర పోరాట యోధుడిగా, అవినీతిపరులను అంతం చేసే సేనాపతిగా నటించి ప్రేక్షకులకు మర్చిపోలేని ట్రీట్ ఇచ్చారు. కమల్ హాసన్ నటన కౌశలానికి పట్టం కట్టేలా ఎన్నో సినిమాలు ఇప్పటి దాకా రిలీజ్ అయినప్పటికీ, ఆయనతో పాటు ఆయన అభిమానులు కూడా మర్చిపోలేని సినిమాల్లో భారతీయుడు ఒకటిగా నిలిచింది.

తొలి పార్ట్ కి ఏఆర్ రెహమాన్ సంగీతం ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. 1990వ దశకంలో ఇండియాలో ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ డెవలప్మెంట్ కాలేదని చెప్పాలి. అయినప్పటికీ భారతీయుడు సినిమా గ్రాఫిక్స్ సీన్స్ ని అద్భుతంగా మెయింటైన్ చేశారు. భారతీయుడు సినిమాకు లభించిన విశేష ఆదరణ, సక్సెస్ సెకండ్ పార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ గా నిలిచింది. చాలాకాలం నుంచి భారతీయుడు 2 మూవీ కోసం కమల్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. భారతీయుడు సినిమా గ్రాఫిక్స్ సీన్స్ ని రియల్ ఎస్టేట్ గా చూపించిన ఘనత శంకర్ కే దక్కింది. అయితే సెకండ్ పార్ట్ కోసం కోట్లు ఖర్చు చేసి ప్రతి సీన్ ని మరింత విజువల్ వండర్ గా తెరకెక్కించారు. ఇక భార‌తీయుడు2 కోసం క‌మ‌ల్ హాస‌న్ తీసుకున్న రెమ్యున‌రేష‌న్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

do you know about Kamal Haasan Remuneration in bharateeyudu 2 movie
Kamal Haasan Remuneration

సీక్వెల్ కోసం కమల్ తీసుకున్న పారితోషికం న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా నిలుస్తోంది. భారతీయుడు 2, 3 కి కలిపి కమల్ రూ. 200 కోట్లు అడిగారట. కానీ మేకర్స్ ఒక్కో పార్ట్ కు రూ. 75 కోట్లు ఇస్తామని నిర్మాతలు అంగీకరించారట. అంటే రెండు భాగాలకు కలిపి రూ. 150 కోట్లు అన్నమాట. దాంతో ఈ ఏజ్ లో కూడా ఈ రేంజ్ పారితోషికం ఏంటి సామీ అంటూ ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.ఇదిలా ఉండగా.. భారతీయుడు 2, 3 పార్ట్ లకు కలిపి రూ. 500 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులోనే శంకర్ పారితోషికం కూడా కలిపి ఉన్నట్లు సమాచారం. అయితే కల్కి మూవీకి కమల్ రూ. 20 కోట్లు, విక్రమ్ సినిమాకు రూ. 50 కోట్లు తీసుకోగా.. భారతీయుడు 2 మాత్రం ఏకంగా రూ. 75 కోట్లు తీసుకుని షాక్ కు గురిచేశాడు. దాదాపు 28 ఏళ్ల తర్వాత సీక్వెల్ వస్తుండటంతో.. ప్రేక్షకులు ఓ రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ తో థియేటర్లకు వెళ్లారు. కానీ అసంపూర్తిగా రెండో భాగం ముగించి.. మూడో భాగంలో ఇంకా ఉందని చూపించడంతో.. ప్రేక్షకులు నిరాశకు గురైయ్యారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago