Anant Ambani Marriage : గత కొద్ది రోజులుగా అనంత్, రాధికాల వివాహ వేడుకకి సంబంధించిన వార్తలు నెట్టింట ఎంత వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. ఇక జూలై 12న ఈ జంట వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కొన్ని నెలలుగా అనంత్ అంబానీ – రాధికా మర్చంట్‌ల వివాహానికి సంబంధించిన వేడుకలు జరుగుతున్నాయి. అనేక కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి పెళ్లి ఘట్టం ముగిసింది. ఇక విందు మాత్రమే మిగిలివుంది. ఇవాళ (శనివారం) ఎంపిక చేసిన కొంతమంది సన్నిహిత అతిథులకు విందు కార్యక్రమాన్ని సిద్ధం చేశారు. రేపు (ఆదివారం) గ్రాండ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు.అనంత్ అంబానీ ప్రత్యేకంగా డిజైన్ చేసిన నారింజ రంగు షేర్వానీ ధరించారు. తన నివాసం యాంటిలియా నుంచి సుందరంగా అలంకరించిన ఎరుపు రంగు కారుపై సంగీతం, నృత్యాల మధ్య ఊరేగింపుగా కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నారు.
అనంతరం హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. బారాత్ ఊరేగింపులో కేవలం సంప్రదాయ ఆచారాలకే పరిమితం కాలేదు. పలువురు సెలబ్రిటీలు డ్యాన్స్ చేశారు. అమెరికా నటుడు, రాపర్ జాన్ సెనా, సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, రణవీర్ సింగ్‌తో పాటు పెళ్లి కొడుకు అనంత్ అంబానీ కూడా డ్యాన్స్ వేశారు. ఇక కింగ్ షారుఖ్ ఖాన్ నీతా అంబానీతో కలిసి చేసిన డ్యాన్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఆషాఢ మాసంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.. చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి ఘనంగా జరుగుతోంది. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం ముంబైలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.
ఆషాఢ మాసంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.. చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి జరగడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మనం మూఢంగా భావించే మాసంలో ఇలా పెళ్లి చేసుకోవడంపై అందరు ఆశ్చర్యపోతున్నారు. అయితే అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహ ముహూర్తాన్ని దృక్‌గణితం ఆధారంగా రూపొందించిన సూర్యమాన పంచాంగం ప్రకారం పండితులు నిర్ణయించారు. దక్షిణ భారతదేశంలో చంద్రుడి కదలికలు.. ఉత్తర భారతదేశంలో సూర్యుడి కదలికల ఆధారంగా పంచాంగాన్ని రూపొందించారు. అందుకే ఆషాఢ మాసంతో సంబంధం లేకుండా ఒక శుభ ముహూర్తాన్ని చూసి పెళ్లి జరిపిస్తున్నారు. అయితే పంచాంగం ప్రకారం కూడా ఈ ముహూర్తం మంచిదేనని పలువురు పండితులు చెబుతున్నారు.సూర్యమానం ప్రకారం శుక్రవారం మేషరాశిలో.. చంద్రుడి సంచారం.. సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం చేస్తూంటాడు. ఇక చంద్రుడు పగలు, రాత్రి వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ ముహూర్తంలో వివాహానికి అత్యంత శుభప్రదమని సూర్యమానం పంచాంగం చెబుతోంది.