Anam Venkata Ramana Reddy : ఏపీ లిక్క‌ర్‌పై ఆనం అదిరిపోయే పంచ్‌లు.. వైసీపీ నాయకుల రియాక్ష‌న్..?

Anam Venkata Ramana Reddy : ఏపీ మ‌ద్యంపై ప్ర‌తిప‌క్షాలు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ వారాహి యాత్ర‌లో ఏపీ మ‌ద్యంపై చిర్రుబుర్రులాడారు. ఇక తాజాగా ఆనం వెంక‌ట‌ర‌మణా రెడ్డి కూడా ఏపీ మ‌ద్యంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రెస్ మీట్‌లో ఎదురుగా ప‌లు ర‌కాల ఏపీ బ్రాండ్స్ పెట్టుకొని ఒక్కొక్క దాని గురించి, ఆ బ్రాండ్ నేమ్ గురించి చెబుతూ ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు ఆనం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధ చట్టాన్ని తీసుకొస్తాం. దశల వారీగా మద్యపానాన్ని నిషేధిస్తాం’ అని విపక్షనేతగా ఉన్న‌ప్పుడు చెప్పిన జ‌గ‌న్ ఏమి చేశారు.

మ‌హిళ‌ల‌కి హామీల మీద హామీలు ఇచ్చారు. తీరా అధికారంలోకి వ‌చ్చాక ఏం చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావొస్తోన్న ఇప్ప‌టికీ మద్యం నిషేధం కాలేదు, జగన్ ఇచ్చిన హామీలు నేరవేరలేదు. ఈ నాలుగేళ్ల పాలనలో జగన్ ఏం చేశారు..? ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో మద్యం ఆదాయం లెక్కలు దేనికి సంకేతం..? మాట తప్పేది లేదు.. మడం తిప్పేది లేదు అన్న జగన్ మోహన్ రెడ్డి.. నాటి మాటలకు-నేటి చేతలకు పొంతన ఎక్కడ..?. అని ఆయ‌న ప్ర‌శ్నించారు.అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో కచ్చితంగా ఊర్లలో మద్యం షాపే లేకుండా చేస్తామని హామీలు ఇచ్చిన జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక ఏం చేశారు.

Anam Venkata Ramana Reddy funny comments on ap mandu brands
Anam Venkata Ramana Reddy

వెయ్యి మంది జనాభా ఉన్న ప్రతి గ్రామంలో పది మంది మహిళా పోలీసుల్ని పెట్టి.. సారాయి, బెల్టుషాపు నిరోధిస్తామన్నారు, నిరోధించారా..?, తాగుడు అనేది లేకుండా పోయిన రోజే ప్రతి కుటుంబంలో.. ప్రేమ, అప్యాయతలు వెల్లివిరిసేదని నాడు ఎంతో ఆవేదన చెందిన జగన్.. 4వ ఏడాదీలోకి అడుగుపెట్టబోతున్నాకూడా ప్రతి కుటుంబంలో ప్రేమ, అప్యాయతలు పూయించ‌లేక‌పోతున్నారు.. మద్యపాన నిషేధం తీసుకుని రాకపోతే అయిదేళ్ల తర్వాత ఓట్లు అడగబోమని ప్రతిపక్ష నేతగా అన్న జగన్.. మద్యంపై ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అని టీడీపీ నేత‌ ఆనం వెంకటరమణా రెడ్డి మీడియా స‌మావేశంలో తెలియ‌జేశారు. ప్ర‌తి బ్రాండ్‌పై ఉన్న పేర్లు చదువుతూ వాటి గురించి చెబుతూ విరుచుకు ప‌డ్డారు ఆనం.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago