Akira Nandan : పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్‌ల ముద్దుల తనయుడు అకీరా నందన్ సినిమాలలోకి రాకుండానే సెలబ్రిటీగా మారాడు. అకీరా తన తండ్రి మాదిరిగానే చాలా తక్కువగా మాట్లాడతాడు, తక్కువగా కనిపిస్తాడు. ఫ్యామిలీలో జరిగే ఆయా వేడుకలు, కార్యక్రమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు. పవన్ నుండి విడిపోయిన తర్వాత అకీరాని చాలా గారాబంగా పెంచిది రేణూ దేశాయ్. ఇప్పుడు అకీరా ఏం చేస్తున్నారు? ఏం చదువుతున్నారు? హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? అనే విషయాలపై నిత్యం చర్చ నడుస్తూనే ఉంటుంది. ఇప్పటికే అకీరా తన తల్లి రేణూ దేశాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇష్క్ వాలా లవ్’ సినిమాలో నటించాడు. అందులో మంచి పేరు తెచ్చుకున్న అకీరా త్వరలో హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ప్రస్తుతం స్టడీస్ పూర్తి చేసే పనిలో ఉన్న అకీరా నందన్ హీరో మెటీరియల్ గా మారుతున్నాడు. అటు నటనలోనూ.. మార్షల్స్ ఆర్ట్స్ లోనూ శిక్షణ పొందుతున్నాడు. అలాగే జిమ్ లో కసరత్తులు చేస్తూ బాడీ డెవలప్ చేస్తున్నాడు. ఇక అకీరా కు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్స్‌ని ఆనందిపంపేస్తుంది రేణూ దేశాయ్. తాజాగా రేణూ దేశాయ్ ఓ వీడియో షేర్ చేయగా, ఇందులో తల్లి, కొడుకులు ఇద్దరు చాలా సరదాగా కనిపించారు. ముఖ్యంగా తన తల్లితో రేణూ దేశాయ్ చేసిన ఫన్ ప్రతి ఒక్కరికి నవ్వు తెప్పిస్తుంది.
ఇక రెండు రోజుల క్రితం రేణూ దేశాయ్.. అకీరాకి సంబంధించిన ఓ పోస్ట్ పెట్టింది. అందులో అకీరా జిమ్ వర్కవుట్స్ చేస్తున్నాడు. అయితే వీడియోకి కామెంట్‌గా రేణూ.. తాను జిమ్ లో వర్కౌట్స్ చేసే సమయంలో ఇంగ్లిష్ సాంగ్స్ ప్లే చేసేవారు. కానీ నేను హిందీలో సాంగ్స్ ప్లే చేయమంటే నన్ను ఓ చదువురాని దానిలా చూసే వారు కానీ నేను అవి పట్టించుకునే దాన్ని కాదు అని తెలిపింది. నేను అకీరాకు కూడా అదే చెప్పే దాన్ని నీ మాతృభాషలో పాటలు వినమని చెప్పేదాన్ని.. ఇప్పుడు అకీరా ఇలా తెలుగు, హిందీ సాంగ్స్ వింటుండటం చాలా సంతోషంగా ఉంది అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు రేణు దేశాయ్. ఇక ఆ మధ్య రేణూ దేశాయ్ మరో పెళ్లి చేసుకుంటుందీ అంటూ వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా కొంత మంది ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఈ ట్రోల్స్ పై ఆమె కూడా ఘాటుగానే స్పందించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…