Balakrishna : ఫ్యామిలీ హీరో జగపతి బాబు లెజెండ్ సినిమాతో విలన్ అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. ఆయన ఇప్పుడు ప్రధాన పాత్రలలో నటిస్తూనే మరోవైపు సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటిస్తున్నారు. తాజాగా జగపతి బాబు నటించిన చిత్రం రుద్రంగి. జగపతి బాబు, విమలా రామన్, మమతా మోహన్‌దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన పిరియాడిక్ యాక్షన్ చిత్రానికి అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించారు. రసమయి ఫిల్మ్స్ బ్యానర్‌పై ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించారు ఈ చిత్రం జూలై 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్‌కి బాలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రుద్రంగి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా విచ్చేసిన నటసింహా నందమూరి బాలకృష్ణ తనదైన మేనరిజం, స్పీచ్‌తో ఆకట్టుకున్నారు. ముందుగా తనదైన రీతిలో తెలంగాణ యాసతో కూడిన ఓ మాస్ డైలాగ్‌ను వదిలారు. ఆ తర్వాత అదే ఉత్సాహాన్ని చూపిస్తూ చివరి వరకూ మాట్లాడారు. ముఖ్యంగా ఈ ఈవెంట్‌లో బాలయ్య తొలిసారిగా అదిరిపోయే కామెడీ పంచ్‌లు వేశారు.సుమతో కూడా సందడి చేశారు.జగపతిబాబుపై ప్రశంసలు కురిపించారు. రుద్రంగి సినిమాలో అందరు వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారని. సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని సినిమా సూపర్ హిట్ అవుతుందని అన్నారు బాలకృష్ణ.
అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జగపతిబాబు ఏవీ ప్రదర్శించగా, అందులో ఓ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించారు. ఆ సమయంలో బాలయ్య ఫేస్ వాడిపోయినట్టుగా కనిపించింది. సొంత అన్న కొడుకు అయిన జూనియర్ తో బాలయ్య కొన్నాళ్లుగా దూరం ఉంటూ వస్తున్నారు. ఆ మధ్య నందమూరి శత జయంతి వేడుకలకి కూడా ఎన్టీఆర్‌ని ఆహ్వానించలేదు. నందమూరి హీరోలు తిరిగి ఒక్కటైతే చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో అనుకుంటున్నారు. అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…