Amla : ఉసిరికాయ పురాణకాలం నుంచి భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఔషద ఫలం. సంస్కృతంలో ఆమలక ఫలం అంటారు. సర్వరోగ నివారిణిగా ఆయుర్వేదంలో చెప్పబడిన త్రిఫల చూర్ణంలో ఒకటి ఉసిరికాయ. మిగిలిన రెండు, కరక్కాయ, తానికాయలు. తరతరాలుగా భారతీయ సంస్కృతిలో ఉసిరికాయ ఒక భాగంగా ఉంది. బ్రిటిష్ వారు దీన్ని ఇండియన్ గూస్‌బెర్రీగా పిలిచేవారు. చలికాలంలో విస్తృతంగా లభించే ఉసిరికాయలో అనేక ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా ఇది విటమిన్ సి కి బ్యాంక్ లాంటిది. యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. సీజన్ కానప్పుడు ఉసిరి దొరకదు.
అలాంటి సమయంలో ఉసిరిని వాడాలి అంటే సీజన్లో ఉసిరికాయలను ముక్కలుగా కట్ చేసి ఎండలో ఎండపెట్టి నిలువ చేసుకోవచ్చు. ఒక్క ఉసిరికాయ రెండు నారింజ పండ్లతో సమానం. కొంచెం వగరు, పులుపు కలయికతో ఉంటుంది. ఉసిరిని రెగ్యులర్ గా తీసుకోవటం వలన రక్తంలో పేరుకుపోయిన కొవ్వులను కరిగించి గుండె జబ్బులు రాకుండా సహాయపడుతుంది. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన వృద్ధాప్య ఛాయలను తగ్గించి యవ్వనంగా ఉండేలా చేస్తుంది. ఉసిరిలో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన ప్రేగు కదలికలను మెరుగు పరచి మలబద్దకం వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.
ఉసిరిని రెగ్యులర్ గా తీసుకోవటం వలన రక్తంలో ఎర్ర రక్తకణాలు పెరుగుతాయి. అంతేకాక ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది. మహిళల్లో మోనోఫాజ్ సమస్యలను తగ్గిస్తుంది. మధుమేహం సమస్య ఉన్నవారు ఉసిరిని రెగ్యులర్ గా తీసుకుంటే రక్తంలో చక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి. గ్యాస్ సమస్యతో బాధ పడుతున్నవారు ఒక గ్లాస్ నీటిలో ఒక గ్రామ్ ఉసిరిపొడి, కొంచెం పంచదార కలిపి త్రాగితే గ్యాస్ సమస్య తగ్గిపోతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు వంటి సాధారణ జబ్బులు రాకుండా కాపాడుతుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…