Ambati Rayudu : వైసీపీలో అంబ‌టి రాయుడు చేరిక‌..? అక్క‌డి నుంచే పోటీ..?

Ambati Rayudu : టీమిండియా మాజీ క్రికెట‌ర్ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట‌ర్‌కి ఎప్పుడో గుడ్ బై చెప్పేశాడు. కొన్నాళ్లుగా ఐపీఎల్ ఆడుతూ వ‌స్తున్నాడు. అయితే రీసెంట్‌గా ఐపీఎల్‌కి కూడా గుడ్ బై చెప్పిన ఈ క్రికెటర్ ప్ర‌స్తుతం రాజకీయాల‌వైపు దృష్టి సారిస్తున్నాడు. గత నెల 11న సీఎం జగన్‌ను కలిసిన అంబటి రాయుడు తాజాగా మరోసారి సీఎంతో భేటీ కావ‌డం ఇప్పుడు రాజ‌కీయాల‌లో చ‌ర్చ‌నీయాంశం అయింది. తెలుగు క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు నిన్న‌ ఏపీ సీఎం జగన్ తో సమావేశమయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన రాయుడు సీఎం జగన్ ను కలిశారు.

తాజా సమావేశంలో రాయుడుతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎన్.శ్రీనివాసన్ కుమార్తె రూపా గురునాథ్, ఇతర సీఎస్కే పెద్దలు కూడా పాల్గొన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకున్న ఐపీఎల్‌ ట్రోఫీని వారు సీఎం జగన్ కు చూపించారు. ఐపీఎల్ విజేతగా నిలిచిన చెన్నై జట్టును ఈ సందర్భంగా సీఎం జగన్ అభినందించారు. ఈ క్రమంలో, చెన్నై ఆటగాళ్ల సంతకాలతో కూడిన జెర్సీని రూపా గురునాథ్, రాయుడు సీఎం జగన్ కు బహూకరించారు. అనంత‌రం క్రీడల అభివృద్ధికి తగిన సూచనలు స్వీకరిస్తామని, ఆ మేరకు పటిష్ఠమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు.

Ambati Rayudu shown ipl cup to cm ys jagan
Ambati Rayudu

జగన్ తో భేటీ అనంతరం అంబటి రాయుడు అక్కడి నుంచి డైరెక్ట్‌గా త‌న ఇంటికి వెళ్లారు.. అయితే జ‌గ‌న్ తో భేటి త‌ర్వాత అంబ‌టి వైసీపీలో చేరడం ఖాయం అన్న‌ట్టుగా ప్రచారం న‌డుస్తుంది. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన అంబటి రాయుడు వైసీపీలో చేరి.. అక్కడి నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సీఎం జగన్‌ను వెంటవెంటనే కలుస్తుండటం ఈ ప్రచారానికి బలం చేకూర్చుతోంది. అయితే, అంబటి రాయుడు గుంటూరు ఎంపీ లేదా పొన్నూరు ఎమ్మెల్యే టిక్కెట్ కావాలని కోరుతున్నాడ‌ని టాక్స్ వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లో దీనిపై ఓ క్లారిటీ రానుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago