Pawan Kalyan : టాలీవుడ్ స్టార్ కమెడీయన్స్‌లో వేణు మాధవ్ ఒకరు. ఆయన కామెడీకి నవ్వని వారు లేరంటే అతిశయోక్తి కాదు.మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టి 400కు పైగా సినిమాలలో నటించిన వేణు మాధవ్..2019 సంవత్సరంలో కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతూ కన్నుమూసారు.సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన వేణుమాధవ్ కు బాల్యం నుంచే డ్యాన్స్ చేయడం అంటే ఎంతో ఇష్టం. రవీంద్ర భారతిలో చేసిన ఒక కామెడీ స్కిట్ వల్ల వేణు మాధవ్ జీవితమే మారిపోయింది. తొలి సినిమా సంప్రదాయం కోసం వేణుమాధవ్ ఏకంగా 70వేల రూపాయల పారితోషికం అందుకున్నారు.
వేణు మాధవ్ కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించారు.20 సంవత్సరాల పాటు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న వేణుమాధవ్ ఎమ్మెల్యే కావాలని భావించినా ఆ కోరిక తీరకుండానే చనిపోయారు.అయితే వేణు మాధవ్ ఎక్కడ ఉంటే అక్కడ సందడి తప్పక ఉంటుంది. ఆయన ఓ సినిమా ఫంక్షన్ వేడుకలో డ్యాన్స్ చేస్తూ అందరిని తెగ నవ్వించాడు. బాలయ్య, పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్‌లు వేణు మాధవ్ డ్యాన్స్ చూసి తెగ నవ్వుకున్నారు. వీడియోలో రేణూ దేశాయ్, పవన్ కళ్యాణ్ పక్కపక్కనే ఉండడం మనం గమనించవచ్చు. అలానే వరుణ్ తేజ్ కూడా ఇందులో కనిపిస్తున్నారు.
కమెడీయన్‌గా ఇండస్ట్రీలో రాణించిన వేణు మాధవ్.. వే స్థిరాస్తులు బాగానే సంపాదించారని తెలుస్తోంది.వేణు మాధవ్ సంపాదించిన ఆస్తుల మార్కెట్ విలువ భారీగా ఉండవచ్చని ప్రచారం జరిగింది.కరీంనగర్, కోదాడలో వేణుమాధవ్ కు వ్యవసాయ భూములు ఉన్నాయని తెలుస్తోంది. భౌతికంగా వేణు మాధవ్ మనకు దూరమైనప్పటికీ సినిమాలు, అతని కామెడీతో ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ విషయానికి వస్తే అప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఇప్పుడు విడిపోయి ఎవరి దారులు వారు వెతుక్కున్నారు. పవన్ తో విడిపోయిన తర్వాత కూడా అభిమానులు రేణు దేశాయ్ ని దారుణంగా ట్రోల్ చేశారు. ఆమెపై విమర్శల వర్షం కురిపించారు. వాటిపై తనదైన శైలిలో ధీటుగా బదులిస్తూ ఉంటుంది రేణూ.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…