Amani : క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పిన‌ ఆమ‌ని… అమ్మ‌ని బ‌య‌ట ఉంచి లోప‌లికి ర‌మ్మ‌న్నారంటూ షాకింగ్ కామెంట్స్..

Amani : తెలుగు చల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న అందం, అభినయంతో ఆక‌ట్టుకున్న అందాల ముద్దుగుమ్మ‌ల‌లో ఆమ‌ని ఒక‌రు. కమల్ హాసన్, జగపతి బాబు వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న హీరోయిన్ ఆమని. గ్లామర్ షోలకు ఏమాత్రం తావివ్వకుండా .. సంప్రదాయ పద్దతిలో కనిపిస్తూనే అగ్రకథానాయికగా ఎదిగారు. ఇక ఇప్పుడు సహయ నటిగా రాణిస్తున్నారు.‘చందమామ’ కథలు చిత్రంతో సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు ఆమని. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చక్కని అవకాశాలు అందుకుంటున్నారు. కెరీర్‌లో తనకు ఎదురైన కష్టాలు అవమానాలను ఆమె గుర్తు చేసుకున్నారు.

సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తలో కొందరు చాలా ఇబ్బందులు పెట్టారని చెప్పిన ఆమ‌ని, అవకాశాలు ఇచ్చేందుకు కొంతమంది తమకు నచ్చిన విధంగా ఉండాలని కోరారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటరిగా చెప్పిన చోటుకి రమ్మన్న వారూ ఉన్నారంటూ కంట‌త‌డిపెట్టారు. కెరీర్‌లో ఎన్నో ప‌రిస్థితులని చ‌వి చూసానంటూ పేర్కొంది ఆమ‌ని. ఎక్కడికెళ్లినా మా అమ్మగారు నాకు తోడు ఉండేవారు. నన్ను లోపలికి పిలిచి అమ్మను బయట కూర్చోమనేవాళ్ళు. మీ అమ్మ లేకుండా ఒంటరిగా రావడం అలవాటు చేసుకో. అప్పుడు అవకాశాలు వాటంత అవే వస్తాయి అనేవారు.

Amani sensational comments on tollywood
Amani

మా అమ్మ లేకుండా రావడం కుదరదని నేను గట్టిగా చెప్పి వచ్చేసే దాన్ని. అలాంటి స‌మ‌యంలో మా నాన్న చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఆయన ఏ ఉద్దేశ్యంతో సినిమా పరిశ్రమ వద్దన్నారో తెలిసొచ్చింది. కెరీర్ మొదట్లో సిస్టర్ రోల్స్ వచ్చాయి. ఒకసారి చేస్తే అలాంటి పాత్రలకే పరిమితం కావాల్సి వస్తుందని చేయలేదు. హీరోయిన్ ఆఫర్ వచ్చే వరకు వేచి చూశాను… అని ఆమని చెప్పుకొచ్చారు. అడ్డదారిలో సినిమాల్లోకి రావడం నాకిష్టం లేదు. అందుకే వెండితెరపై ఎంట్రీ ఇవ్డ్వడానికి రెండేళ్లు పట్టింది” అంటూ చెప్పుకొచ్చారు ఆమని. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న కొన్ని రోజులకే తెలుగులో ‘జంబ లకిడి పంబ’లో ఆఫర్‌ వచ్చింది. అదే నా తొలి తెలుగు సినిమా. అక్కడి నుంచి నా కెరీర్‌ మారిపోయింది. అనంతంర స్టార్ హీరొయిన్‌గా మారాను అని ఆమ‌ని చెప్పుకొచ్చింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago