Nani : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ నానిపై గుర్రుగా ఉన్నారా.. అందుకు కార‌ణ‌మేంటంటే..?

Nani : ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన నాని మంచి విజ‌యాల‌తో దూసుకుపోతూ స్టార్ హీరోల‌లో ఒక‌రిగా ఉన్నారు. ఒక‌వైపు హీరోగా, మ‌రోవైపు నిర్మాత‌గా కూడా నాని స‌త్తా చాటుతున్నాడు. 2023 నానికి ఎక్స్‌ ట్రా స్పెషల్ ఇయర్‌ కానుంది. అందుకు కార‌ణం ఈ ఏడాది ప్రారంభంలోనే హిట్‌ 2 సినిమాతో నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్నాడు. అంతేకాకుండా నాని నటిస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్‌ ప్రాజెక్ట్‌ దసరా మార్చి 30న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌తోపాటు సాంగ్స్‌ సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి.. ఈ సినిమా నాని కెరీర్‌లోనే మొదటి అతిపెద్ద పాన్ ఇండియా సినిమా కానుంది.

హిట్‌, ఫ్లాప్స్ అనే తేడా లేకుండా దూసుకుపోతున్న నాని త‌ను చేసే చిత్రాల‌కు క్లాసిక్ టైటిల్స్ పెట్టుకుంటూ పోతున్నాడు. జెంటిల్‌మేన్‌`, `మజ్ను`, `కృష్ణార్జున యుద్ధం`, `దేవదాస్‌`, `గ్యాంగ్‌ లీడర్‌` సినిమాల్లో `జెంటిల్‌మేన్‌`, `మజ్ను` ఇలా త‌న కెరీర్‌లో ఎన్నో వైవిధ్య‌మైన చిత్రాలు చేశాడు. అయితే నాని ఆ క్లాసిక్స్ టైటిల్స్ ని చెడగొట్టిన దాఖ‌లాలే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సూప‌ర్ హిట్ మూవీ టైటిల్ తో ఓ సినిమా చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. శౌర్య దర్శకత్వంలో `నాని30` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. దీంతోపాటు శైలేష్‌ కొలనుతో `హిట్‌ 3` సినిమా చేస్తున్నారు. అలాగే `మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి`(ఎంసీఏ) డైరెక్టర్‌ శ్రీరామ్‌ వేణుతో ఓ సినిమా చేయ‌నుండ‌గా, ఈ సినిమాకి పవన్‌ కళ్యాణ్‌ క్లాసిక్‌ టైటిల్‌ని అనుకుంటున్నారట.

pawan kalyan fans angry on nani for this reason
Nani

`తమ్ముడు` అనే టైటిల్‌ అయితే చిత్రానికి బాగుంటుందని మేక‌ర్స్ భావిస్తున్నారట. ఈ వార్త తెలిసి ఇప్పుడు పవన్‌ ఫ్యాన్స్ ఫైర్‌ అవుతున్నారని సమాచారం. నానికి మెగా ఫ్యామిలీ టైటిల్స్ తప్ప వేరే హీరో టైటిల్స్ దొరకట్లేదా అంటూ ప్రశ్నిస్తున్నారట. ఇప్పటికే `గ్యాంగ్‌ లీడర్‌` టైటిల్‌ పెట్టి దాన్ని చెడగొట్టారు. ఇప్పుడు త‌మ్ముడు పేరుతో ఎందుకు సినిమా చేయాల‌నుకుంటున్నారు అని మండిప‌డుతున్నార‌ట‌. మ‌రి దీనిపై నాని ఏమైన స్పందిస్తాడా అనేది చూడాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే నాని నటించిన తొలి పాన్‌ ఇండియా మూవీ ద‌స‌రా కాగా, ఇది శ్రీకాంత్‌ ఓడెల అనే నూతన దర్శకుడు రూపొందించారు. కీర్తిసురేష్‌ కథానాయికగా నటించింది. తెలంగాణ సింగరేణి బ్యాక్‌ డ్రాప్‌లో ఊరమాస్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago