Amani : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తన అందం, అభినయంతో ఆకట్టుకున్న అందాల ముద్దుగుమ్మలలో ఆమని ఒకరు. కమల్ హాసన్, జగపతి బాబు వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న హీరోయిన్ ఆమని. గ్లామర్ షోలకు ఏమాత్రం తావివ్వకుండా .. సంప్రదాయ పద్దతిలో కనిపిస్తూనే అగ్రకథానాయికగా ఎదిగారు. ఇక ఇప్పుడు సహయ నటిగా రాణిస్తున్నారు.‘చందమామ’ కథలు చిత్రంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు ఆమని. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చక్కని అవకాశాలు అందుకుంటున్నారు. కెరీర్‌లో తనకు ఎదురైన కష్టాలు అవమానాలను ఆమె గుర్తు చేసుకున్నారు.
సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తలో కొందరు చాలా ఇబ్బందులు పెట్టారని చెప్పిన ఆమని, అవకాశాలు ఇచ్చేందుకు కొంతమంది తమకు నచ్చిన విధంగా ఉండాలని కోరారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటరిగా చెప్పిన చోటుకి రమ్మన్న వారూ ఉన్నారంటూ కంటతడిపెట్టారు. కెరీర్‌లో ఎన్నో పరిస్థితులని చవి చూసానంటూ పేర్కొంది ఆమని. ఎక్కడికెళ్లినా మా అమ్మగారు నాకు తోడు ఉండేవారు. నన్ను లోపలికి పిలిచి అమ్మను బయట కూర్చోమనేవాళ్ళు. మీ అమ్మ లేకుండా ఒంటరిగా రావడం అలవాటు చేసుకో. అప్పుడు అవకాశాలు వాటంత అవే వస్తాయి అనేవారు.
![Amani : క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పిన ఆమని... అమ్మని బయట ఉంచి లోపలికి రమ్మన్నారంటూ షాకింగ్ కామెంట్స్.. Amani sensational comments on tollywood](http://3.0.182.119/wp-content/uploads/2023/02/amani.jpg)
మా అమ్మ లేకుండా రావడం కుదరదని నేను గట్టిగా చెప్పి వచ్చేసే దాన్ని. అలాంటి సమయంలో మా నాన్న చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఆయన ఏ ఉద్దేశ్యంతో సినిమా పరిశ్రమ వద్దన్నారో తెలిసొచ్చింది. కెరీర్ మొదట్లో సిస్టర్ రోల్స్ వచ్చాయి. ఒకసారి చేస్తే అలాంటి పాత్రలకే పరిమితం కావాల్సి వస్తుందని చేయలేదు. హీరోయిన్ ఆఫర్ వచ్చే వరకు వేచి చూశాను… అని ఆమని చెప్పుకొచ్చారు. అడ్డదారిలో సినిమాల్లోకి రావడం నాకిష్టం లేదు. అందుకే వెండితెరపై ఎంట్రీ ఇవ్డ్వడానికి రెండేళ్లు పట్టింది” అంటూ చెప్పుకొచ్చారు ఆమని. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న కొన్ని రోజులకే తెలుగులో ‘జంబ లకిడి పంబ’లో ఆఫర్ వచ్చింది. అదే నా తొలి తెలుగు సినిమా. అక్కడి నుంచి నా కెరీర్ మారిపోయింది. అనంతంర స్టార్ హీరొయిన్‌గా మారాను అని ఆమని చెప్పుకొచ్చింది.