Allu Aravind:మెగా వ‌ర్సెస్ అల్లు ఫ్యామిలీ వార్..అర‌వింద్ కామెంట్స్‌తో ఇప్ప‌టికైన పులిస్టాప్ ప‌డతాయా..!

Allu Aravind: గ‌త కొద్ది రోజులుగా సినీ ప‌రిశ్ర‌మ‌లో అనేక ప‌రిణామాలు చోటు చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. అయితే మెగా కుటుంబం వర్సెస్ అల్లు అర్జున్ వివాదం పెరుగుతోంది. కుటుంబసభ్యుల సంగతెలా ఉన్నా ఇరువురి అభిమానులు మాత్రం వివాదాన్ని రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియా సాక్షిగా తెగ ర‌చ్చ చేస్తున్నారు. అల్లు అర్జున్‌తో మెగా ఫ్యామిలీకు దూరం ఉందనే విషయాన్ని ఫ్యాన్స్ ధృవీకరిస్తున్నారు. ఇటీవల మెగా ఫ్యాన్స్ అంటే..చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్ అభిమానులు చేసిన ఓ పని..బన్నీ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.ఆ త‌ర్వాత క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డంతో అది స‌ద్దుమ‌ణిగింది.

అర‌వింద్ షాకింగ్ కామెంట్స్..

అల్లు రామలింగయ్య కారణంగానే చిరంజీవి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారని..బన్నీ అభిమానులు చెబుతుంటే..మెగా కుటుంబం లేకపోతే మీరెక్కడంటూ చిరు అభిమానులు వాదిస్తున్నారు. కుటుంబసభ్యులు, రెండు కుటుంబాల మధ్య అంతర్గతంగా ఎలా ఉన్నా..ఫ్యాన్స్ మాత్రం వార్ కొనసాగిస్తూనే ఉన్నారు. బ‌న్నీ పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదగడంతో, మెగా ఫ్యామిలీలోనూ వరుసగా హీరోలు సినీ రంగంలోకి రావడంతో రెండు కుటుంబాల మధ్య పోటీ పెరిగిందని, ఇది విభేదాలకు మూల కార‌ణంగా మారిన‌ట్టు తెలుస్తుంది.

అయితే ఈ ప్ర‌చారాల‌కి అల్లు అర‌వింద్ అడ్డుక‌ట్ట వేసే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నాడు. ఆ మ‌ధ్య మా మ‌ధ్య గొడ‌వ‌లు ఉన్నాయ‌న్న‌ది అంతా పుకార్లే అని చెప్పిన అరింద్ తాజాగా మ‌రో సారి ఈ చ‌ర్చ‌పై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. చిరంజీవి, తాను 80 నుంచి స్నేహితులమని చెప్పారు. స్నేహితులుగా ఉంటూనే కెరీర్‌ పరంగా ఎదుగుతూ వచ్చామన్నారు. ఆ విధంగానే తమ కుటుంబాలు కూడా ఎదుగుతూ వచ్చాయని, పిల్లలు కూడా రంగంలో స్థిరపడటంతో పోటీ మరింత పెరిగిందన్నారు. ఎంత పోటీ ఉన్నా అది కెరీర్ పరంగానే కానీ, ఫ్యామిలీల పరంగా కాదని స్పష్టం చేశారు అల్లు అరవింద్‌. సంక్రాంతి పండుగ వస్తే తమ ఇంట్లో నాన్నగారి కార్యక్రమాలు పూర్తి చేసుకుని అందరం చిరంజీవి ఇంటికి వెళ్తామ‌న్నారు. అలానే దీపావ‌ళి కూడా చిరంజీవి ఇంట్లో చేసుకుంటామ‌ని ఆయ‌న అన్నారు. ఇవన్నీ వీడియోలు తీసి చూపించ‌లేం క‌దా అంటూ అర‌వింద్ ట్రోల‌ర్స్‌కి చుర‌క‌లు అంటించాడు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago