Srihari : ఇండస్ట్రీకి రాకముందు రియల్ స్టార్ శ్రీహరి చేసిన పనిని చూస్తే అందరూ సలాం చేస్తారు..

Srihari : తెలుగు చలనచిత్ర పరిశ్రమంలో ఎప్పటికీ మర్చిపోలేని నటులు కొందరు ఉంటారు. ఈ జనరేషన్ లో అలాంటి అరుదైన నటుడు రియల్ స్టార్ శ్రీహరి. ఆయన మనకు దూరమై దాదాపు 9 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ అతని మర్చిపోలేకపోతున్నారు అభిమానులు. ఎన్ని సినిమాలు చేశామనేది కాదు.. ఎలాంటి సినిమాలు చేశాం అనేలా ప్రేక్షకుల మదిలో ముద్ర వేసుకున్నారు రియల్ స్టార్. తనదైన అద్భుతమైన నటనతో యాక్షన్, ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు ఈయన. శ్రీహరి ఇండస్ట్రీకి రాకముందు ఎన్ని కష్టాలు పడ్డాడో తెలిస్తే కన్నీరు ఆగవు..

రియల్ స్టార్ శ్రీహరిని చూస్తే అంతా తెలంగాణ ప్రాంతం వాడు అని అనుకుంటారు. కానీ ఆయన సొంత ఊరు ఇది కాదు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలోని ఓ పేద కుటుంబంలో 1964 ఆగస్టు 15న శ్రీహ‌రి జ‌న్మించాడు. అయితే ఆయనకు ఊహ తెలియ‌క‌ ముందే కుటుంబం హైద‌రాబాద్ కు వ‌ల‌స వ‌చ్చింది. హైద‌రాబాద్ లో శ్రీహ‌రి కుటుంబం పాల బిజినెస్ చేసే వాళ్ళు. అలాగే వాళ్లకు ఒక చిన్న మెకానిక్ షెడ్ కూడా ఉండేది. ఉండటానికి సొంత ఇల్లు కూడా లేని సమయంలో వర్షం పడుతున్నప్పుడు ముగ్గురు అన్నదమ్ములు అదే మెకానిక్ షెడ్డులో తలదాచుకునే వాళ్ళు. చినుకులు వస్తున్నా కూడా.. అలాగే తడుస్తూ పడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని అప్పట్లో శ్రీహరి చెప్పేవాడు. చిన్నప్పటి నుంచి శ్రీహ‌రికి బ్రూస్ లీ సినిమాలు అంటే చెప్ప‌లేనంత ఇష్టం. ఆ ఇష్టంతోనే ఆయన జిమ్నాస్టిక్ లో శిక్షణ తీసుకొని జాతీయ స్థాయి వరకు వెళ్ళాడు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నటుడు కావాలి అనుకున్నాడు.

do you know what Srihari done before coming into film industry
Srihari

సినిమా ఇండ‌స్ట్రీలో అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్న స‌మ‌యంలో దాస‌రి గుర్తించి బ్ర‌హ్మ‌నాయుడు సినిమాలో అవ‌కాశం ఇచ్చారు. తన మొహానికి మొదటిసారి రంగు వేసి బొట్టు పెట్టి ఇండస్ట్రీకి ఆహ్వానించింది దాసరి నారాయణరావు.. నా గురువు అంటూ చనిపోయే వరకు గర్వంగా చెప్పుకున్నాడు శ్రీహరి. బ్రహ్మనాయుడు సినిమా విజయం సాధించక పోయినా కూడా ఆ తర్వాత శ్రీహరికి కొన్ని సినిమాలలో అవకాశాలు వచ్చాయి. సాధారణంగా హీరోలు కొడితే విలన్లు కింద పడిపోతారు.. కానీ శ్రీహరి మాత్రం రొటీన్ గా ఉండడం ఎందుకు అని విలనిజంలో కూడా కొత్త కొత్తగా ప్రయత్నించాడు. అదే ఆయనకు ఇతర ప్రతి నాయకులనుంచి వేరు చేసి చూపించింది. రౌడీ ఇన్స్పెక్ట‌ర్, తాజ్ మ‌హ‌ల్ సినిమాల్లో యంగ్ విల‌న్ రోల్స్ చేసి శ‌భాష్ అనిపించుకున్నారు.

పోలీస్ సినిమాతో హీరో అయిన ఆ తర్వాత వరుసగా సాంబయ్య, దేవా, భద్రాచలం లాంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో ఒక మంచి అన్నగా తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్నాడు. మగధీర లాంటి సినిమాలలో శ్రీహరి నటన ఎప్పటికీ అజరామరం. కెరీర్ పాన్ ఇండియా స్థాయికి వెళుతున్న సమయంలో కేవలం 49 సంవత్సరాల వయసులో కాలేయ సంబంధిత వ్యాధితో 2013 అక్టోబర్ 9న మరణించాడు శ్రీహరి. ఈయన మరణంలో కూడా మిస్టరీ ఉందని.. డాక్టర్లు చేసిన తప్పిదం వల్లే తన భర్త చనిపోయాడు అంటూ శ్రీహరి భార్య శాంతి ఆరోపించడం అప్పట్లో సంచలనంగా మారింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago