Ravi Teja : 30 సంవత్సరాల తన కెరీర్లో రవితేజ ఎన్నో సినిమాలు వదిలేశాడు. హీరో కాకముందు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈయన.. స్టార్ డం వచ్చిన తర్వాత తనవరకు వచ్చిన కొన్ని సినిమాలను చేజేతులా వదిలేసుకున్నాడు. అందులో కొన్ని సూపర్ డూపర్ హిట్లు కూడా ఉన్నాయి. మరికొన్ని ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఉన్నాయి. దాదాపు 17 ఏళ్ల క్రితం రవితేజ ఒక డిజాస్టర్ సినిమా కోసం ఇండస్ట్రీ హిట్ వదిలేసుకున్నాడు. సోషల్ మీడియాలో ఆ వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. అందులో హీరో ఎవరో తెలుసా..
రవితేజ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే దానికి ఒక ప్రధానమైన కారణం పూరీ జగన్నాథ్. ఎందుకంటే ఇద్దరు ఒకేసారి కెరీర్ మొదలుపెట్టారు.. ఈయన హీరో అయ్యాడు. ఆయన దర్శకుడు అయ్యాడు. అప్పట్లో తాను రాసుకునే ప్రతి కథ ముందు రవితేజకు చెప్పిన తర్వాత ఇతర హీరోల దగ్గరికి వెళ్లేవాడు పూరి. ఈ క్రమంలోనే ఇద్దరి కాంబినేషన్లో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా ఆడలేదు.. కానీ కెరీర్ మొదట్లో మాత్రం ఒకరికి ఒకరు చాలా హెల్ప్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఉత్తం సింగ్ అనే ఒక సిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీ రవితేజకు చెప్పాడు పూరి జగన్నాథ్. అది ఆయనకు బాగా నచ్చింది. కాకపోతే డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడు.
అదే సినిమాను తర్వాత మహేష్ బాబు హీరోగా చేయాలనుకున్నాడు పూరి. వెళ్లి కథ చెప్పడం.. ఆయన ఓకే చెప్పడం అన్ని వెంట వెంటనే జరిగిపోయాయి. ఈ గ్యాప్ లోనే నాగార్జునతో సూపర్ సినిమా చేసి వచ్చాడు పూరి. అయితే ఆ తర్వాత తాను అనుకున్న ఉత్తమ్ సింగ్ సినిమాలో మహేష్ బాబు సలహా మేరకు హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ స్టోరీ మార్చి.. పోకిరి అని టైటిల్ మార్చాడు. ఈ సినిమా స్టోరీ రవితేజకు పూరి జగన్నాథ్ చెప్పినప్పుడు.. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ అనే సినిమా చేస్తున్నాడు. అది మనసుకు చాలా దగ్గరైన సినిమా కావడంతో పోకిరి వదిలేసుకున్నాడు రవితేజ. ఆ తర్వాత ఆ సినిమాలో మహేష్ బాబు నటించడం.. అది ఇండస్ట్రీ హిట్ సాధించడం వరుసగా జరిగిపోయాయి.
అప్పటి వరకు తెలుగు సినిమాకు కేవలం 30 కోట్ల మార్కెట్ ఆకాశమంత హద్దులో ఉండేది. అలాంటిది పోకిరి ఏకంగా 42 కోట్ల షేర్ వసూలు చేసింది. ప్రిన్స్ మహేష్ బాబును కాస్త సూపర్ స్టార్ గా మార్చేసింది. ఒకవేళ ఆ సినిమా రవితేజ చేసి ఉంటే ఆ టైంకు ఆయనకున్న ఇమేజ్ కు చాలా పెద్ద హిట్ అయి ఉండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…