Allu Arjun : గంగోత్రి సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేసిన హీరో అల్లు అర్జున్. ఈ సినిమా చూసినప్పుడు అల్లు అర్జున్ ఓ రేంజ్ హీరో కూడా కావడం కష్టమే అని అందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. గత ఏడాది విడుదలైన పుష్ప సినిమాతో బన్నీ తెలుగులోనే కాకుండా ఇతర భాషలలోను అశేష ఆదరణ పొందాడు. ఇక బన్నీ నటిస్తున్న పుష్ప 2 సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పార్ట్ 2లో అల్లు అర్జున్ ఎలాంటి లుక్ లో కనిపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
సీక్వెల్‌లో అల్లు అర్జున్ కాస్త డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం బాలీవుడ్ ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ ప్రీతి షీల్ అల్లు అర్జున్ కు మేకప్ చేస్తుందట. ఈ మేకప్ టెస్ట్ లో పుష్ఫ రాజ్ రఫ్ లుక్ నుంచి కాస్త భిన్నమైన లుక్ లో కనిపించారని తెలుస్తోంది. ఈ నెల 22 నుండి ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ జరగనున్నట్టు తెలుస్తుంది. అయితే సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ పోయిన అల్లు అర్జున్ పారితోషికం విషయంలోనూ తగ్గేదే లే అన్నట్టుగా దూసుకు పోతున్నట్టు తెలుస్తుంది.
ఇప్పటివరకు ఇండియన్ సినిమా హిస్టరీలోనే రూ.125 కోట్ల పారితోషికం ఒకే సినిమాకి తీసుకుంటున్న హీరో సల్మాన్ ఖాన్ కాగా ఇప్పుడు అదే పారితోషికం అందుకుంటున్న హీరోగా అల్లు అర్జున్ నిలిచినట్టు చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం సౌత్‌లో రూ.125 కోట్ల పారితోషికం అందుకునే తొలి హీరోగా అల్లు అర్జున్ సరికొత్త చరిత్ర లిఖించినట్టు అవుతుందని బన్నీ ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తున్నారు. రీసెంట్‌గా బెంగుళూరులో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో పుష్ప స్టార్స్ సందడి చేశారు. బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్ అవార్డు అందుకున్నాడు. అంతేకాదు మరో ఐదు కేటగిరిల్లో కూడా పుష్ప సినిమాకు అవార్డులు దక్కాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…