Heroines : సాధారణంగా మనం సినిమా సెలబ్రిటీల ఇంటర్వ్యూలు చూసినప్పుడు అందులో వారు కొన్ని సీక్రెట్స్ రివీల్ చేస్తూ మనల్ని ఆశ్చర్యపరుస్తుంటారు. ముఖ్యంగా వారి పేర్ల విషయంలో భలే ఆసక్తికర సంగతులు చెబుతుంటారు. తమ పేరు ఇది కాదని సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చాకే ఇలా మార్చుకున్నామని దాని వెనక చాలా స్టోరీ ఉందని చెప్పి మనల్ని సర్‌ప్రైజ్ చేస్తుంటారు. అయితే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొంత మంది హీరోయిన్లు.. పరిశ్రమలోకి వచ్చి తమ ప్రతిభను చాటి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు.
వారిలో ముఖ్యంగా సౌందర్య, రోజా, రంభ, రాశి, అనుష్క వంటి వారు ఉన్నారు. అయితే వీళ్ల అస్సలు పేర్లు ఇవి కావట. సినిమాల్లోకి వచ్చాకే అలా మార్చుకున్నారట. ఆ పేర్లతో వారికి మంచి గుర్తింపు దక్కడంతో అలాగే కంటిన్యూ చేస్తున్నారట. అనుష్క శెట్టి అసలు పేరు స్వీటీ శెట్టి. ఈమెది కర్ణాటక. ఇక సౌందర్య అసలు పేరు సౌమ్య. కర్ణాటకలో పుట్టిన సౌమ్య సినిమాల్లోకి వచ్చాక తన పేరును సౌందర్యగా మార్చుకుంది. రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి. శ్రీలత పేరుతో ఇంతకు ముందే ఒక నటి ఉండడంతో రోజా అని పేరు పెట్టుకుంది.
రంభ అసలు పేరు విజయలక్ష్మి. విజయవాడలో పుట్టిన రంభ స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. 1990లలో ఈ అమ్మడు టాలీవుడ్‌ని షేక్ చేసింది. ఇక రాశి అసలు పేరు మంత్ర. సినిమాల్లోకి వచ్చాక మంత్ర.. రాశిగా మారింది. లేడీ సూపర్ స్టార్ నయనతార కేరళ రాష్ట్రానికి చెందిన అమ్మాయి కాగా, ఈమె అసలు పేరు డయానా మరియం కురియన్. ఇక అతిలోక సుందరి శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్. సినిమాల్లోకి వచ్చాక శ్రీదేవిగా మారిపోయింది. జయప్రద అసలు పేరు లలితా రాణి. సినీ రంగంతోపాటు రాజకీయాల్లో కూడా రాణించారు ఈమె. అడపాదడపా సినిమాలలో మెరుస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…