Allu Arjun : ఈ మధ్య సినీ సెలబ్రిటీలపై విమర్శలు చేస్తూ హైలైట్ కావాలని చాలా మంది భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సంచలన ఆరోపణలు కూడా చేస్తున్నారు. కొద్ది రోజులుగా అల్లు అర్జున్‌పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీ సపోర్ట్‌తో ఎదిగిన ఆయన ఇప్పుడు మెగా ఫ్యామిలీనే పట్టించుకోవడం లేదని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కు బర్త్ డే విషెస్ చెప్పని కారణంగా కూడా బన్నీ ట్రోల్స్ బారిన పడ్డాడు. ఇక రీసెంట్‌గా కృష్ణం రాజు మరణంకి సంబంధించి ఆయన సోషల్ మీడియాలో ఎలాంటి ట్వీట్ చేయకపోవడంతో విమర్శలు గుప్పించారు.
అయితే బన్నీ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేయకపోయినా జూబ్లీహిల్స్‌లోని కృష్ణం రాజు ఇంటికి వెళ్లి భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. అంతేకాక తన స్నేహితుడు ప్రభాస్‌ని ఓదారుస్తూ.. ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కృష్టంరాజు ఇంటికి దగ్గర్లోనే తాను సొంతిల్లు కట్టుకుంటున్నానని తెలిపిన బన్నీ, ఇల్లు పూరైన తర్వాత కృష్టంరాజు ఫ్యామిలీని భోజనానికి పిలవాలనుకున్నానని.. ఇంతలోనే కన్నుమూశారని అల్లు అర్జున్ అన్నారు. ఆయన గురించి నేను చెప్పేటంత వాడిని కాదు. ఆయనను అభిమానించే ప్రతి ఒక్కరికి, కుటుంబానికి, ప్రభాస్‌కి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
అయితే బన్నీ స్వయంగా కృష్ణం రాజు ఇంటికి వెళ్లి నివాళులు అర్పించడంతో అప్పటి వరకు ఆయనపై ట్రోల్స్ చేసిన వారు దెబ్బకు నోరు మూసుకున్నారు. ఇక బెంగుళూరులో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో పుష్ప స్టార్స్ సందడి చేశారు. బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్ అవార్డు అందుకున్నాడు. అంతేకాదు మరో ఐదు కేటగిరిల్లో కూడా పుష్ప సినిమాకు అవార్డులు అందాయి. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 17న విడుదలై మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ నైజాం (తెలంగాణ) లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. పుష్ప సినిమాకు కలెక్షన్స్‌తోపాటు ప్రశంసలు కూడా అలాగే వచ్చాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…