ఏపీ రాష్ట్ర రాజకీయా సమీకరణలు మొత్తం మారిపోయాయి. ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రంగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య వైజాగ్ లో పవన్ కళ్యాణ్ పర్యటనని అధికారులు అడ్డుకోవడం మొదలుకొని, మొన్న ఇప్పటం గ్రామాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించినంత వరుకు వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. పవన్ కి జనాల్లో రోజు రోజుకి పెరుగుగుతున్న క్రేజ్ తట్టుకోలేక వైసీపీ ప్రభుత్వం రూ. 250 కోట్లు ఆయన్ని చంపడానికి ముంబైలో ఒక అతనికి సుపారీ ఇచ్చిందని..
ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ పై గత కొద్ది రోజుల నుండి గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నారని జనసేన పార్టీ సంచలన ఆరోపణలు చెయ్యగా.. దీనిపై వైసీపీ నాయకులూ తమదైన శైలిలో స్పందించారు. ఇటీవలే వైసీపీ పార్టీ తరుపున ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమితమైన అలీ కూడా దీనిపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారిని ఎవరో కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారు. జగన్ గారికి దొంగచాటున రెక్కీలు నిర్వహించాల్సిన అవసరం లేదు.
ఆయన ఏదైనా ముక్కుసూటిగా వెళ్లే మనిషి. నా మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా అలాంటి వాడే. చెప్పుడు మాటలు వినకుండా నిజానిజాలు ఆయన తెలుసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నా అంటూ అలీ వ్యాఖ్యనించాడు. అలాగే ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటన గురించి మాట్లాడుతూ.. అభివృద్ధిలో భాగంగా ఇళ్ళని కూల్చడం సర్వసాధారణం అయినా ఇప్పటంలో ఒక్క ఇల్లు కూడా ప్రభుత్వం కూల్చలేదు అంటూ చెప్పుకొచ్చాడు అలీ. తాజాగా పవన్ పై అలీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…