Akira Nandan : గత కొద్ది రోజులుగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలతో సందడి చేయడం కాస్త తగ్గించాడు. ఏడాదిన్నర తర్వాత తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో కలిసి బ్రో అనే సినిమా చేశాడు. ఈ చిత్రం నేడు గ్రాండ్‌గా విడుదలైంది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించడంతో అభిమానులలో అంచనాలు భారీగా పెరిగాయి.. తమిళ చిత్రం ‘వినోదయ సీతమ్’కు రీమేక్ గా వచ్చింది. పవన్ కళ్యాణ్ వింటేజ్ యాక్షన్ తో పాటు వన్ మ్యాన్ షోగా థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. సినిమాని చూసేందుకు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా థియేటర్‌కి క్యూ కడుతున్నారు.
ఇక ఈ సినిమా చూసేందుకు పవన్ కొడుకు అకీరా నందన్ సుదర్శన్ థియేటర్ కు వచ్చారు. కాస్ట్లీ కారులో థియేటర్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అకీరాతో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. ఆయన వెహికిల్ చుట్టూ పవన్ కళ్యాణ్ అభిమానులు చేరిపోయి.. ‘జూనియర్ పవర్ స్టార్’ అంటూ నినాదాలు చేశారు. బాబులకే బాబు అకీరా బాబు అంటూ అరిచి గోలపెట్టారు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక అకీరా నందన్ హీరోగా ఎప్పుడు ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నారని అభిమానులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.
అకీరా సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని వార్తలు వస్తుండడం, అలానే పవన్ స్టార్ ఫ్యాన్స్ కంట పడటంతో ఖుషీ అవుతున్నారు. ‘బ్రో’ చిత్రం చూసేందుకు రావడంతో మరింత సంతోషిస్తున్నారు. అకీరా నందన్ తర్వలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరిగింది. ‘ఓజీ’ సినిమాతోనే ప్రేక్షకులను అలరించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇప్పటికే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. లో అకీరా ఎంట్రీ ఎలా ఉంటుందనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రేణూ దేశాయ్ మాత్రం తన కొడుకు సినిమాలలోకి రాడని చెబుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…