టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్టు శనివారం తన ఇన్ స్టా వేదికగా తెలియజేసిన సంగతి తెలిసిందే. ఆమె ప్రకటనతో ఫ్యాన్స్, సినీ ప్రముఖులు షాకయ్యారు. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు అభిమానులు, సెలబ్రెటీలు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, శ్రియా, రాశిఖన్నా, సుస్మిత కొణిదెల స్పందిస్తూ.. త్వరగా కోలుకో.. ఎప్పటిలాగే ధైర్యంగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత.. ఉన్నట్టుండి సైలెంట్ కావడంతో పలు వార్తలు తెరమీదకు వచ్చాయి.
కొద్ది రోజులుగా సామ్ అరుదైన చర్మ సమస్యతో బాధపడుతుందని వార్తలు చక్కర్లు కొట్టాయి. సామ్ అనారోగ్యం గురించి వస్తున్న వార్తలు అవాస్తమని కొట్టిపారేశారు ఆమె మేనేజర్. ఇటీవల ఆమె నటించిన ఓ యాడ్ షూట్ ఫోటోస్ బయటకు వచ్చాయి. అందులో సామ్ ముఖం కాస్త వేరుగా కనిపించింది. దీంతో ఆమె సర్జరీ చేయించుకుందని.. అందుకే ఫోటోస్ షేర్ చేయడం లేదంటూ వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ క్రమంలోనే తాను మైసోటిస్ వ్యాధితో ఇబ్బందిపడుతున్నట్లు ప్రకటించి తన అనారోగ్యంపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది సామ్.
సమంతా మయోసైటిస్ పరిస్థితిపై అక్కినేని స్పందన కోసం సమంత అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తుండగా.. సామ్ పోస్టు చూసి అఖిల్ అక్కినేని సైతం స్పందించారు. అందరి ప్రేమాభిమానాలే నీకు మరింత బలాన్ని ఇస్తాయి డియర్ సామ్ అంటూ అఖిల్ చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజన్లు మరి నాగ చైతన్య ఇంకా ఎందుకు స్పందించలేదు అంటూ అభిప్రాయపడుతున్నారు. సమంత ఇంత బాధలోనూ యశోద అనే పాన్ ఇండియా సినిమా డబ్బింగ్‌ను పూర్తి చేసింది. ఈ సినిమా నవంబర్ 11న రిలీజ్ కానుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…