Achennaidu : చంద్ర‌బాబు అరెస్ట్ నేప‌థ్యంలో క‌ల‌క‌లం సృష్టిస్తున్న అచ్చెన్నాయుడు ఆడియో

Achennaidu : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్ కాగా, ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుంది. చంద్ర‌బాబుని అరెస్ట్ చేయ‌డం ప‌ట్ల టీడీపీ నాయ‌కులు తెగ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా అచ్చెన్నాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఆడియో విడుద‌ల చేశారరు. ఏసీ సీఎం జగన్‌కి పిచ్చి పరాకాష్టకు చేరిందన్న ఆయన.. 14 ఏళ్లు ఈ రాష్ట్రానికి సేవలు అందించిన చంద్రబాబును అరెస్టు చెయ్యడమేంటని ప్రశ్నించారు. తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన చంద్రబాబు సేవల్ని దేశవ్యాప్తంగా అందరూ మెచ్చుకున్నారని అన్నారు.

చంద్రబాబు ఉగ్రవాది కాదు, పారిపోరు, దాక్కొని తప్పించుకునే వ్యక్తి కాదు. కేంద్రం ఇచ్చిన NSG ప్రొటెక్షన్ కలిగిన వ్యక్తి, అలాంటి ఆయన పట్ల ఇలా ప్రవర్తించి, ప్రతి ఒక్కరూ అసహ్యించుకునేలా చేశారు” అని అన్నారు. “ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు.. ఏపీని చీకట్లోకి నెట్టారు” అని మండిపడ్డారు. తాను గానీ, చంద్రబాబు గానీ ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే, పీక కోసుకుంటాననీ, రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్నారు అచ్చెన్నాయుడు. తాజాగా విడుద‌లైన‌ వీడియోలో చంద్రబాబు అరెస్టయినా కార్యకర్తలు రోడ్ల మీదకు రావడం లేదంటూ అచ్చెన్నాయుడు ఆక్రోశం వెళ్లగక్కుతున్నట్లుగా చూపిస్తోంది. వెంటనే జన సమీకరణ చేయాలంటూ నాయకులతో అచ్చెన్నాయుడు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించనట్లుగా ఆడియోలో తెలుస్తోంది.

Achennaidu audio leak viral on social media
Achennaidu

ప్రజలు రోడ్ల మీదకు రావడం లేదంటూ అచ్చెన్నాయుడు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున కార్యకర్తలను రోడ్డు మీదకు తీసుకురావాలంటూ ఆదేశాలిచ్చారు. మహిళలను తీసుకొస్తే పోలీసులు అడ్డుకోరంటూ నాయకులకు సలహాలు ఇస్తున్నారు.. కష్టాల్లో ఎవరైనా ఉంటే.. వెంటనే ముందుగా చంద్రబాబు స్పందిస్తారనీ అలాంటి ఆయన్ని… రాత్రి 10 గంటలపాటూ ప్రశ్నించి, 2 రోజులు నిద్రలేకుండా చేశారని మండిపడ్డారు. రోడ్డుపై ఆందోళన చేస్తున్న టీడీపీ శ్రేణులను పోలీసులు లాఠీఛార్జి చేశారని ఫైర్ అయ్యారు.ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్‌లో రూ.241 కోట్లు అవినీతి జరిగిందనే అభియోగాలతో.. ఏపీ సీఐడీ పోలీసులు శనివారం ఉదయం 6 గంటలకు చంద్రబాబు నాయుడిని నంద్యాలలో అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago