Anshu Malika : ఒకప్పుడు తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించిన రోజా స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. అప్పటి టాప్ హీరోలందరి సరసన నటించిన రోజా తెలుగులోనే కాదు… ఇతర భాషల్లోనూ నటించి. మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక హీరోయిన్‌గా కొన్నాళ్లు చేసిన రోజా.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగాను సినిమాల్లో నటించి అలరించింది. ఇక రాజకీయాల్లోకి వెళ్లిన రోజా.. అక్కడ తన సత్తా చాటుతూ.. ప్రస్తుతం ఏపీ మంత్రిగా ఏపీ రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. రోజా.. తమిళ డైరెక్టర్ సెల్వమణిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు. అందులో అన్షుమాలిక ఒకరు.
అన్షు మాలిక తన బర్త్ డే సందర్భంగా ఓ వీడియోను తన సోషల్ మీడియాలో షైర్ చేయగా, అది తెగ వైరల్ గా మారింది.. తన 20వ బర్త్ డే సందర్భంగా ఆమె ఓ వీడియోలో మాట్లాడుతూ.. చిన్నప్పుడూ బర్త్ డే అంటే పెద్దగా పట్టించుకునే దాన్ని కాదు… అయితే ఇప్పుడు 20 బర్త్ మరో కొన్ని గంటల్లో వస్తుండడంతో చాలా నర్వస్‌గా, ఎంగ్జైటీగా ఉందని చెప్పుకొచ్చింది. ఇక ఇదిలా ఉండగా… అన్షు మాలిక చూసిన నెటిజన్స్ ఆమె ఇంగ్లీష్ యాక్సెంట్ పై కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో మాట్లాడోచ్చుగా అని కొందరూ కామెంట్స్ పెట్టగా… మరికొంత మంది మంచు లక్ష్మికి చెల్లెలు దొరికిందని కామెంట్స్ చేస్తున్నారు. మంచు లక్ష్మీలా ఇంగ్లీష్ మాట్లాడుతుందని వారి అభిప్రాయం.
ప్రస్తుతం అన్షు మాలిక వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఇందులో అన్షు మాలిక లుక్ అభిమానులని కొంత నిరాశపరుస్తుంది. రోజా కూతురు అన్షు మాలిక త్వరలో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారంటూ నెటిజన్స్ వైరల్ చేస్తున్నారు. అన్షుమాలిక టాలీవుడ్ ఎంట్రీకి 20ఏజ్ కరెక్ట్ అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక తను టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందో లేదో తెలియదు. రోజా అప్పుడప్పుడు తన కూతురు, కొడుకు పిక్స్ నెట్టింట షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి మంచి వినోదం పంచుతుంది. రోజా ఇప్పుడు మంత్రిగా ఉన్న నేపథ్యంలో సినిమాలు, బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…