Akula Venkateshwar Rao : చంద్ర‌బాబు అరెస్ట్.. కోర్టు వ‌ద్ద స్వీట్స్ పంచిన టీడీపీ నేత‌..

Akula Venkateshwar Rao : టీడీపీ అధినేత చంద్ర‌బాబు అరెస్ట్ ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల‌లో సంచ‌ల‌నంగా మారింది. ‘బాబు స్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు శుక్రవారం రాత్రి నంద్యాలలో బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం ఆర్కే ఫంక్షన్ హాలులో బస చేశారు. అర్ధరాత్రి 12 గంటల తరువాత 600 మందికిపైగా పోలీసులు నంద్యాలకు చేరుకున్నారు. అడుగడుగునా చెక్‌పోస్టులు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. చంద్రబాబు బస చేస్తున్న ఆర్కే ఫంక్షన్‌ హాల్‌ను ఎస్పీ రఘువీర్‌రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది పోలీసులు చుట్టుముట్టారు. అనంతరం డీఐజీ రఘురామిరెడ్డి, ఎస్పీ రఘువీర్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో టీడీపీ నేతలు గవర్నర్ ను కలవనున్నారు. ఇవాళ రాత్రి 7.15 గంటలకు గవర్నర్ నజీర్ టీడీపీ నేతలకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. చంద్రబాబు అరెస్టు, టీడీపీ నేతల గృహ నిర్బంధాలు, పోలీసుల తీరుపై గవర్నర్ కు టీడీపీ నేతలు ఫిర్యాదుచేయనున్నారు.

అయితే చంద్ర‌బాబు అరెస్ట్‌తో ఇప్పుడు ఏపీలో ప్ర‌కంప‌న‌లు రేగుతున్నాయి. కొంద‌రు చంద్ర‌బాబు అరెస్ట్‌ని ఖండిస్తుండ‌గా, మ‌రి కొంద‌రు మాత్రం సంబురాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా వైసీపీ నేతలు చంద్ర‌బాబు అరెస్ట్‌తో తెగ పండుగ చేసుకుంటున్నారు. అయితే టీడీపీ నేత ఒక‌రు స్వ‌యంగా స్వీట్స్ పంచ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. విజ‌యవాడ కోర్ట్ ద‌గ్గ‌ర ఆకుల వెంక‌టేశ్వ‌ర‌రావు అనే టీడీపీ నేత సంతోషంతో స్వీట్స్ పంచి పెట్టారు. ఈ సంఘ‌ట‌న ప్ర‌తి ఒక్క‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. అయితే ఆయ‌న చేసే ప‌ని టీడీపీ శ్రేణుల‌కి కోపం తెప్పిస్తుంద‌ని భావించిన పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేష‌న్‌కి త‌ర‌లించారు.

Akula Venkateshwar Rao tdp leader distributed sweets after chandra babu naidu arrest
Akula Venkateshwar Rao

గ‌తంలో ఆకుల వెంక‌టేశ్వ‌ర‌రావు మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ నుండి త‌న‌కి ప్రాణ హాని ఉంద‌ని అన్నాడు. పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్న నా పేరు లోకేష్ త‌న ద‌గ్గ‌ర ఉన్న రెడ్ బుక్‌లోకి ఎక్కించుకున్నాడు. జూబ్లిహిల్స్ లోని 400 గ‌జాల స్థ‌లాన్నిచంద్ర‌బాబు మ‌నిషి లాక్కున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.అయితే చంద్ర‌బాబుపై పీక‌ల్లోతు కోపం పెంచుకున్న ఆకుల తాజాగా స్వీట్స్ పంచ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. ఇక ఇదిలా ఉంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. దీంతో కోర్టు వద్ద, ఈ మార్గంలో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. దాదాపు 200 మంది పోలీసులను కోర్టు ప్రాంగణంలో మోహరించారు. కోర్టు వద్ద ఆందోళన చేస్తున్న టీడీపీ మహిళా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago