Aarambham On OTT : ఓటీటీలోకి వ‌చ్చేసిన థ్రిల్ల‌ర్ మూవీ ఆరంభం.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే..!

Aarambham On OTT : సినిమా థియేట‌ర్స్ లో రిలీజ్ అయిన కొద్ది రోజుల‌కే ఓటీటీలో ప్ర‌త్య‌క్షం అవుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇక తెలుగు థ్రిల్ల‌ర్ మూవీ ఆరంభం ఈ ఏడాది మే 10న ఆడియన్స్ ముందుకు రాగా, ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. సైంటిఫిక్ థ్రిల్లర్ గా మూవీ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమాని ఏవీటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మాణంలో కొత్త దర్శకుడు అజయ్ నాగ్ వి తెర‌కెక్కించారు. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 5 అర్ధ‌రాత్రి నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

చిత్ర క‌థ విష‌యానికి వ‌స్తే.. మిగిల్‌(మోహన్‌ భగత్‌) కి మర్డర్‌ కేసులో రెండున్నరేళ్లుగా కాలాఘటి జైల్లో ఉంటాడు. చివరికి అతనికి ఉరిశిక్ష పడుతుంది. ఉరిశిక్ష అమలు చేయడానికి ఒక్క రోజే ఉంటుంది. కట్‌ చేస్తే ఆ జైలు నుంచి మిగిల్ తప్పించుకుంటాడు. అయితే సెల్‌ తాళాలు వేసినవి వేసినట్టే ఉంటాయి, జైలుకి ఎలాంటి రంధ్రాలు లేవు, పారిపోయినట్టు ఎలాంటి ఆధారాలు లేవు. పైగా జైల్లో పటిష్టమైన భద్రత ఉంటుంది. మరి జైలు సెల్‌ నుంచి మిగిల్‌ ఎలా తప్పించుకున్నాడనేది పెద్ద మిస్టరీ. ఇది పోలీస్‌ డిపార్ట్ మెంట్ కి పెద్ద టాస్క్ లా మారుతుంది. ఎలా తప్పించుకున్నాడు, ఎక్కడికి వెళ్లాడు అనేది తెలియదు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ సస్పెన్స్ ని చేధించడానికి డిటెక్టివ్‌(రవీంద్ర విజయ్‌) రంగంలోకి దిగుతాడు.

Aarambham On OTT know the streaming platform and details
Aarambham On OTT

మిగిల్‌ ఉన్న సెల్‌లో ఓ బుక్ దొరుకుతుంది. అందులో మిగిల్‌ చిన్నప్పుడు పెరిగిన వివరాలు, తన గురువు (భూషణ్‌) చేస్తున్న డేజావు ప్రయోగాల గురించి ఉంటుంది. మరి మిగిల్‌ చిన్నప్పటి లైఫ్‌ ఏంటి? ఎలా పెరిగాడు, తన సర్‌ ఎవరు? ఆయన చేసే ప్రయోగాలేంటి? ఇంతకి మిగిల్‌ ఎలా తప్పించుకున్నాడు అనేది `ఆరంభం` సినిమా మిగిలిన కథ. ఆరంభం సినిమా ఓ కన్నడ నవల ఆధారంగా తెరకెక్కింది. సినిమా స్క్రీన్ ప్లే కొత్తగా రాసుకున్నారు. మొత్తం ఒక కథలా కాకుండా కొన్ని అధ్యాయాలుగా సినిమాని తెరకెక్కించారు. కథ విషయంలో కొన్ని సీన్స్ లో మాత్రం కన్ఫ్యూజ్ అవ్వక తప్పదు. సినిమా కొద్దిగా స్లోగానే సాగుతుంది. అమ్మ సెంటిమెంట్ మాత్రం బాగా వార్కౌట్ అవుతుంది. అలాగే డెజావు సైన్స్ ఎక్స్‌పరిమెంట్స్ ఆసక్తిగానే సాగుతాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ ట్విస్ట్ మాత్రం ఆసక్తిగా అనిపిస్తుంది. సీక్వెల్ కి ఛాన్స్ ఉండేలా క్లైమాక్స్ లో ఓ లీడ్ ఇచ్చారు. మరి సీక్వెల్ ఉంటుందా లేదా చూడాలి.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago